Dailyhunt
ఇండియన్ బ్యాంక్‌లో.. 350 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

ఇండియన్ బ్యాంక్‌లో.. 350 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Merupulu 1 week ago

బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలనుకునే నిరుద్యోగులకు ఇండియన్ బ్యాంక్ అదిరిపోయే న్యూస్ చెప్పింది. 2026 సంవత్సరానికి గానూ స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 350 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో ఐటీ, ఫైనాన్స్, క్రెడిట్, మార్కెటింగ్ వంటి వివిధ విభాగాల్లో మేనేజర్ స్థాయి పోస్టులు ఉన్నాయి. అప్లికేషన్ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. పోస్టులను బట్టి విద్యార్థతలు నిర్ణయించారు. కాబట్టి అర్హత,ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ వివరాలు:
మొత్తం పోస్టులు- 350

అర్హతలు:
పోస్టులను బట్టి విద్యార్హతలు నిర్ణయించారు.

ఐటీ పోస్టులు: బీఈ/బీటెక్ (CS/IT) లేదా ఎంసీఏ పూర్తి చేసి ఉండాలి.

ఫైనాన్స్/క్రెడిట్: సీఏ లేదా ఏంబీఏ (Finance) ఉత్తీర్ణులై ఉండాలి.

ఇతర విభాగాలకు: సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ లేదా పీజీ (MBA/PGDM) ఉండాలి.

అనుభవం: మేనేజర్ స్థాయి పోస్టులకు 2 నుంచి 5 ఏళ్ల వరకు పని అనుభవం ఉండాలి.

వయస్సు (01-04-2026 నాటికి):
అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు: అభ్యర్థుల వయస్సు 22-32 సంవత్సరాల మధ్య ఉండాలి.

మేనేజర్ పోస్టులు: 23-35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు అర్హులు.

సీనియర్ మేనేజర్ పోస్టులు: అభ్యర్థుల వయస్సు 25-38 సంవత్సరాల మధ్య ఉండాలి.

(ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది)

అప్లికేషన్ ఫీజు: జనరల్ /ఓబీసీ /ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.850 చెల్లించాలి. ఎస్సీ /ఎస్టీ / పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు రూ. 175 (కేవలం ఇంటిమేషన్ ఛార్జీలు) చెల్లించాల్సి ఉంటుంది.

ఎంపిక విధానం:
అభ్యర్థులను ప్రధానంగా రెండు పద్ధతుల్లో ఎంపిక చేస్తారు.

అప్లికేషన్లు ప్రారంభం:
అభ్యర్థులు నేటి నుంచి ఈ పోస్టుల కోసం అప్లై చేసుకోవచ్చు.

చివరి తేదీ: ఏప్రిల్ 28 వ తేదీ వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉటుంది.

ఎలా అప్లై చేయాలి?
1.ముందుగా అభ్యర్థులు ఇండియన్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ indianbank.in లోకి లాగిన్ అవ్వాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Merupulu