Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జూన్ 5 నుంచి.. టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు

జూన్ 5 నుంచి.. టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు

Merupulu 3 weeks ago

రాష్ట్రవ్యాప్తంగా టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 5 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ హాల్‌టికెట్లను ఇప్పటికే అధికారికంగా విడుదల చేసింది.

పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తమ పూర్తి వివరాలను ఎంటర్ చేసి వెబ్‌సైట్ ద్వారా హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే.. జూన్ 5 నుంచి జూన్ 12 వరకు ఎలాంటి గ్యాప్ లేకుండా ఈ పరీక్షలు వరుసగా జరగనున్నాయి.

హాల్‌టికెట్ డౌన్ లోడ్ ప్రాసెస్, పరీక్షల షెడ్యూల్:
తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించే ఈ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయి. విద్యార్థులు తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. అక్కడ మీ జిల్లా పేరు, మీ పేరు, స్కూల్ పేరు, పుట్టిన తేదీ (DOB) వివరాలను ఎంటర్ చేసి సులభంగా హాల్‌టికెట్ పొందవచ్చు.

టెన్త్ 2026 సప్లిమెంటరీ పరీక్షల పూర్తి టైం టేబుల్:
జూన్‌ 5: ఫస్ట్‌ లాంగ్వేజ్‌ (గ్రూప్‌-ఎ)

జూన్‌ 6: సెకండ్ లాంగ్వేజ్‌

జూన్‌ 7: థర్డ్‌ లాంగ్వేజ్‌ (ఇంగ్లీష్‌)

జూన్‌ 8: మ్యాథమెటిక్స్‌

జూన్‌ 9: సైన్స్‌ పార్ట్‌-1 (ఫిజికల్‌ సైన్స్‌)

జూన్‌ 10: సైన్స్ పార్ట్‌-2 (బయాలాజికల్‌ సైన్స్‌)

జూన్‌ 11: సోషల్‌ స్టడీస్‌ー మెయిన్ లాంగ్వేజ్ పేపర్‌-1

జూన్‌ 12: ఓఎస్‌ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్‌ పేపర్‌-2

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Merupulu