డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బీఏ,బీకాం,బీఎస్సీ డిగ్రీ (Old Batch) చదువుతున్న విద్యార్థులకు వర్సిటీ అధికారులు కీలక అప్‌డేట్ ఇచ్చారు.
వివిధ కారణాల వల్ల పరీక్షలు రాయలేక బ్యాక్‌లాగ్ పేపర్లు ఉన్నవారు పరీక్ష ఫీజు చెల్లించేందుకు మే 25వ తేదీని గడువుగా నిర్ణయించారు. 2016-17 విద్యా సంవత్సరానికి చెందిన విద్యార్థులతో పాటు.. అంతకంటే ముందు చేరిన వారు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డైరెక్టర్ డాక్టర్ వై.వెంకటేశ్వర్లు సూచించారు.
ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేయలేకపోయిన పాత విద్యార్థులకు ఇది ఒక గొప్ప అవకాశం. ముఖ్యంగా ఇయర్ వైజ్ విధానంలో చదువుతున్న వారు తమ పెండింగ్ పేపర్లను పూర్తి చేసుకునేందుకు ఈ నిర్ణయంతో వర్సిటీ వెసులుబాటు కల్పించింది.
ఎవరు అర్హులు?
2016 కంటే ముందు బ్యాచ్: 2016 కంటే ముందు చేరిన విద్యార్థులు బ్యాక్‌లాగ్ పరీక్షలు రాయాలనుకుంటే.. వారు తప్పనిసరిగా రీ-అడ్మిషన్ (Re-Admission) తీసుకోవాల్సి ఉంటుంది. రీ-అడ్మిషన్ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాతే పరీక్ష ఫీజు చెల్లించడానికి అవకాశం ఉంటుంది.
2016-17 బ్యాచ్: ఈ విద్యా సంవత్సరంలో చేరి బ్యాక్‌లాగ్ పేపర్లు ఉన్న విద్యార్థులు.
ఫీజు చెల్లించే విధానం:
1.అభ్యర్థులు ముందుగా యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ www.braouonline.in లోకి లాగిన్ అవ్వాలి.
2.హోమ్ పేజీలో UG (Year Wise) Login ఆప్షన్ ఎంచుకోవాలి.
పరీక్ష ఫీజు చెల్లించడానికి మే 2 చివరి తేదీగా ప్రకటించారు. గడువు ముగిసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అప్లికేషన్లు తీసుకోమని అధికారులు స్పష్టం చేశారు. అంతే కాకుండా విద్యార్థులకు ఏవైనా సందేహాలుంటే.. తమ తమ పరిధిలోని స్టడీ సెంటర్లను సంప్రదించాలని లేదా వర్సిటీ హెల్ప్ లైన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు.

