నిరుద్యోగ యువతకు భారతీయ రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్‌మెంట్ నోటిఫికేషన్ (CEN No. 01/2026) ద్వారా 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్న ఐటీఐ, డిప్లొమా, బీటెక్ అర్హత కలిగిన అభ్యర్థులకు ఇది సువర్ణావకాశం.
ఈ పోస్టులకు మే 15 నుంచి జూన్ 14 వరకు ఆన్‌లైన్ ద్వారా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పటిష్టమైన ఎంపిక విధానం ద్వారా అత్యంత ప్రతిభావంతులైన అభ్యర్థులను రైల్వే శాఖ ఈ కొలువులకు ఎంపిక చేయనుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
నోటిఫికేషన్ పూర్తి వివరాలు :
మొత్తం ఖాళీల వివరాలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో మొత్తం 11,127 పోస్టులను భర్తీ చేస్తున్నారు. కేటగిరీల వారీగా ఖాళీలు..
జనరల్ (UR): 4,860
ఓబీసీ (NCL): 2,598
ఎస్సీ (షెడ్యూల్డ్ కులాలు): 1,746
ఎస్టీ (షెడ్యూల్డ్ తెగలు): 919
ఈడబ్ల్యూఎస్ (ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు): 1,004
(గమనిక: మొత్తం పోస్టులలో 1,115 ఖాళీలను మాజీ సైనికోద్యోగులకు (ExSM) కేటాయించారు).
జోన్ల వారీగా ఖాళీల వివరాలు (2026)
అర్హతలు :
విద్యార్హత: అభ్యర్థులు టెన్త్ పాసవడంతో పాటు కింద పేర్కొన్న వాటిలో ఏదో ఒక అర్హత కలిగి ఉండాలి.
1.గుర్తింపు పొందిన సంస్థ నుంచి నిర్దేశిత ట్రేడుల్లో ఐటీఐ లేదా యాక్ట్ అప్రెంటిస్‌షిప్ పూర్తి చేసి ఉండాలి.
2.మెకానికల్,ఎలక్ట్రికల్,ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ విభాగాల్లో 3 సంవత్సరాల డిప్లొమా లేదా బీఈ/బీటెక్(డిగ్రీ) పూర్తి చేసిన వారు కూడా అర్హులే. (గమనిక: ఫైనల్ ఇయర్ రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్న వారు అప్లై చేయడానికి అర్హులు కారు).
వయోపరిమితి (01-07-2026 నాటికి):
అభ్యర్థుల కనీస వయస్సు 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు, SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.
ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభం: మే 15 నుంచి అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు.
అప్లికేషన్లకు చివరి తేదీ: జూన్14 రాత్రి 11:59 గంటల వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది .
అప్లికేషన్ ఎడిట్/కరెక్షన్ విండో: జూన్ 17 నుంచి జూన్ 26వరకు అప్లికేషన్ ఎడిట్‌కు అవకాశం కల్పించారు.
జీతం: 7వ సీపీసీ ప్రకారం ప్రారంభ బేసిక్ పే రూ.19,900 (లెవెల్-2) ఉంటుంది. దీనికి అదనంగా రైల్వే అలవెన్సులు (HRA, DA, మైలేజ్ అలవెన్స్) కలిపి జీతం ఇస్తారు.
ఫీజు: సాధారణ, ఓబీసీ అభ్యర్థులకు రూ. 500 (CBT-1 పరీక్షకు హాజరైతే రూ.400 రీఫండ్ అవుతుంది). ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు రూ.250 (పరీక్షకు హాజరైతే రూ.250 పూర్తిగా రీఫండ్ అవుతుంది).
ఎంపిక విధానం :
అసిస్టెంట్ లోకో పైలట్ ఎంపిక మొత్తం ఐదు దశల్లో జరుగుతుంది.
మొదటి దశ (CBT-1): ఇది కేవలం స్క్రీనింగ్ పరీక్ష మాత్రమే (75 మార్కులు, 60 నిమిషాలు).
రెండవ దశ (CBT-2): ఇందులో రెండు భాగాలు ఉంటాయి. పార్ట్-A (100 మార్కులు) మెరిట్ కోసం లెక్కిస్తారు. పార్ట్-B (75 మార్కులు) కేవలం క్వాలిఫైయింగ్ పరీక్ష మాత్రమే.
కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్ (CBAT): ఇందులో నెగటివ్ మార్కింగ్ ఉండదు. ప్రతి బ్యాటరీలో కనీసం 42 టి-స్కోర్ సాధించాలి.
డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV)
మెడికల్ ఎగ్జామినేషన్ (ME): అభ్యర్థులు తప్పనిసరిగా A-1 మెడికల్ స్టాండర్డ్ కలిగి ఉండాలి. (కంటి చూపు 6/6 ఉండాలి. లేసిక్ సర్జరీ చేయించుకున్న వారు అర్హులు కారు).
ఎలా అప్లై చేయాలి?
అభ్యర్థులు rrbapply.gov.in ద్వారా మాత్రమే అప్లై చేయాలి. ఒక అభ్యర్థి కేవలం ఒక రైల్వే బోర్డుకు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్ సైట్ సంప్రదించవచ్చు.

