Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నీట్ యూజీ స్టేట్ మెరిట్ లిస్ట్ విడుదల

నీట్ యూజీ స్టేట్ మెరిట్ లిస్ట్ విడుదల

Merupulu 1 week ago

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ (NEET UG 2026) పరీక్షలకు సంబంధించి తెలంగాణలో అడ్మిషన్ల ప్రక్రియ వేగవంతమైంది. ఈ నేపథ్యంలోనే ఎంబీబీఎస్ (MBBS), బిడీఎస్ (BDS) వంటి మెడికల్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్న అభ్యర్థుల కోసం కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం (KNRUHS) కీలక అప్‌డేట్ అందించింది.తాజాగా నీట్ యూజీ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థుల మెరిట్ లిస్ట్ అధికారిక వెబ్‌సైట్‌ www.knruhs.telangana.gov.in లో అందుబాటులో ఉంచింది.

కాగా వర్సిటీ విడుదల చేసిన ఈ పీడీఎఫ్ ఫైల్‌లో అభ్యర్థుల అడ్మిషన్లకు సంబంధించిన పూర్తి సమాచారం అందించారు. ఇందులో అభ్యర్థుల పేరు, నీట్ యూజీ స్కోరు, ఆల్ ఇండియా ర్యాంక్, స్టేట్ ర్యాంక్, కేటగిరీ, కటాఫ్ పర్సంటైల్ వంటి వివరాలు స్పష్టంగా ఉన్నాయి. నీట్ పరీక్ష రాసిన అభ్యర్థులు తమ వివరాలను చెక్ చేసుకునేందుకు ఈ లిస్ట్ ఎంతగానో ఉపయోగ పడుతుంది.

సూచనలు:
కాళోజీ వర్సిటీ అభ్యర్థులకు, తల్లిదండ్రులకు ఒక ముఖ్యమైన విషయాన్ని స్పష్టం చేసింది. తాము విడుదల చేసిన లిస్ట్ కేవలం అభ్యర్థుల అవగాహన, సమాచారం కోస మాత్రమేనని, దీనిని పూర్తి స్థాయి 'ఫైనల్ మెరిట్ లిస్ట్'గా పరిగణించరాదని తేల్చిచెప్పింది. అడ్మిషన్ల కోసం అప్లై చేసుకునే ముందు అభ్యర్థులు వర్సిటీ అధికారికంగా విడుదల చేసే పూర్తి స్థాయి నోటిఫికేషన్ జాగ్రత్తగా చదవాలని విజ్ఞప్తి చేసింది.ఇదిలా ఉంటే.. అడ్మిషన్లకు సంబంధించిన ఇతర మార్గదర్శకాల కోసం విద్యార్థులు ఎప్పటికప్పుడు అధికారిక వెబ్‌సైట్‌ను చెక్ చేయాలి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Merupulu