తెలంగాణ రాష్ట్ర పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TG POLYCET 2026) ఫలితాలు అధికారికంగా విడుదలయ్యాయి. స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (SBTET) శనివారం ఉదయం 11:30 గంటలకు ఈ ఫలితాలను వెల్లడించింది.
హైదరాబాద్ మాసబ్ ట్యాంక్‌లోని ఎస్‌వీ భవన్‌లో సాంకేతిక విద్యా కమిషనర్ ఈ ర్యాంక్ కార్డ్‌లను విడుదల చేశారు. పరీక్షకు హాజరైన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈసారి మీసేవ వాట్సాప్ సర్వీస్ ద్వారా నేరుగా మొబైల్‌కే ఫలితాలు పంపే వినూత్న సేవను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.
ర్యాంక్ కార్డ్ ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకునే విధానం:
వాట్సాప్ ద్వారానే కాకుండా విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి ర్యాంక్ కార్డ్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
1.మొదటగా స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (SBTET) అధికారిక వెబ్‌సైట్‌లో www.polycet.sbtet.telangana.gov.inకి లాగిన్ అవ్వండి.
2.హోంపేజీలో అందుబాటులో ఉన్న "TG POLYCET 2026 Results / Rank Card" లింక్‌పై క్లిక్ చేయండి.
3.మీ పాలిసెట్ హాల్ టికెట్ నంబర్ , పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేయండి.
4.వివరాలు ఎంటర్ చేసిన తర్వాత మీ ర్యాంక్ కార్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
5.కౌన్సెలింగ్ అవసరాల డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ అవుట్ తీసి పెట్టుకోండి.

