Dailyhunt
రైల్వేలో 2,801 ఉద్యోగాలు.. అప్లై చేశారా ?

రైల్వేలో 2,801 ఉద్యోగాలు.. అప్లై చేశారా ?

Merupulu 2 weeks ago

క్షిణ మధ్య రైల్వే (SCR), సికింద్రాబాద్ పరిధిలోని వివిధ ట్రేడ్‌లలో ఖాళీగా ఉన్న యాక్ట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా..

2,801 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్ వంటి పలు విభాగాల కోసం అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 11 వరకు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. కేవలం మెరిట్ ఆధారంగానే.. ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

దక్షిణ మధ్య రైల్వే అప్రెంటిస్ రిక్రూట్ మెంట్-పూర్తి వివరాలు:
మొత్తం పోస్టులు- 2,801

ఖాళీల వారిగా.. వివరాలు

ఎలక్ట్రీషియన్: 1258

ఫిట్టర్: 539

ఏసీ మెకానిక్: 251

వెల్డర్:202

డీజిల్ మెకానిక్: 105

కోపా: 181

ఇతర ట్రేడ్‌లు: కార్పెంటర్, పెయింటర్, మెషినిస్ట్, ఎలక్ట్రానిక్ మెకానిక్ మొదలైనవి..

అర్హతలు:
విద్యార్హత:
అభ్యర్థులు కనీసం 50% మార్కులతో.. టెన్త్ ఉత్తీర్ణత సాధించాలి. సంబంధిత ట్రేడ్‌లో NCVT/SCVT గుర్తింపు పొందిన ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి.

వయస్సు: ఏప్రిల్ 11 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. (SC/STలకు 5 ఏళ్లు, OBCలకు 3 ఏళ్లు, PwBD అభ్యర్థులకు 10 ఏళ్ల వయో సడలింపు ఉంటుంది).

ప్రాంతీయ అర్హత: తెలంగాణ, ఏపీ (శ్రీకాకుళం,విజయనగరం,మన్యం జిల్లాలు మినహా).. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు (వెల్లూరు), మధ్యప్రదేశ్ లోని కొన్ని జిల్లాల అభ్యర్థులు మాత్రమే అర్హులు.

ఎంపిక విధానం:
ఎలాంటి రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఉండదు. టెన్త్, ఐటీఐలో వచ్చిన మార్కుల సగటు ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారు చేసి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ ఫీజు: జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూసీ పురుషులకు రూ. 100. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులకు ఫీజు లేదు.

అప్లికేషన్‌కు ముందు www.apprenticeshipindia.gov.in (RDAT) పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి.

అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ సంప్రదించవచ్చు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Merupulu