రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు అలర్ట్. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఆధ్వర్యంలో.. జూనియర్ ఇంజనీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ , కెమికల్ అండ్ మెటలాజికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సంబంధించి కొనసాగుతున్న ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రక్రియ త్వరలోనే ముగియనుంది.
మొత్తం 4029 ఖాళీల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల చేయగా.. ఇందుకు సెప్టెంబర్ 13 వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పోస్టులను బట్టి విద్యార్హతలు నిర్ణయించారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా వెంటనే అప్లై చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ అప్లికేషన్లకు చివరి తేదీ: సెప్టెంబర్ 13 (రాత్రి 11:59 గంటల వరకు)
ఎడిట్ ఆప్షన్: సెప్టెంబర్ 16 నుంచి 25 వరకు అప్లికేషన్ ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
పోస్టుల వివరాలు , ఖాళీలు:
మొత్తం 4029 పోస్టులలో జూనియర్ ఇంజనీర్ (JE), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS), కెమికల్ అండ్ మెటలాజికల్ అసిస్టెంట్ (CMA) పోస్టులు ఉన్నాయి. అన్ని పోస్టులకు పే లెవల్ 6 వర్తిస్తుంది. వీటి ప్రారంభ జీతం నెలకు రూ. 35,400 ఉంటుంది.
విద్యార్హతలు:
జేఈ, డిఎంఎస్: సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో.. మూడేళ్ల డిప్లొమా లేదా బీఈ/బీటెక్ పూర్తి చేసి ఉండాలి.
సిఎంఏ (CMA: ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్ కాంబినేషన్‌తో కనీసం 45% మార్కులతో బి.ఎస్సీ డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు.
వయో పరిమితి:
అభ్యర్థుల వయస్సు 18 నుంచి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసి, ఇతర వర్గాల వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం:
ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో భాగంగా అభ్యర్థులకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT-I, CBT-II) నిర్వహిస్తారు. వీటిలో మెరిట్ సాధించిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV), మెడికల్ ఎగ్జామినేషన్ (ME) నిర్వహించి ఫైనల్ లిస్ట్ తయారు చేస్తారు.
ఎలా అప్లై చేయాలి?
అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే అప్లై చేసుకోవాలి. అప్లై చేసే ఇందు కోసం ముందుగా ఫోటో, సిగ్నేచర్, అవసరమైన సర్టిఫికెట్లను సిద్ధంగా ఉంచుకోవాలి.

