Dailyhunt
రేపటితో ముగియనున్న పాలిసెట్ రిజిస్ట్రేషన్లు.. పరీక్ష ఎప్పుడంటే?

రేపటితో ముగియనున్న పాలిసెట్ రిజిస్ట్రేషన్లు.. పరీక్ష ఎప్పుడంటే?

Merupulu 3 weeks ago

టెన్త్ పూర్తి చేసి టెక్నికల్ రంగంలో సెటిల్ అవ్వాలనుకుంటున్నారా? పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో చేరాలని ఉందా? అయితే మీకు ఇదే చివరి అవకాశం. ఏపీ పాలిసెట్ 2026 అప్లికేషన్ గడువు రేపటితో (ఏప్రిల్ 9) ముగుస్తుంది.

కాబట్టి ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.400, ఎస్సీ, ఎస్టీలు రూ.100 ఫీజు చెల్లించి అప్లై చేసుకోవచ్చు. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా మెకానికల్, సివిల్, ఈఈఈ, ఈసీఈ ,కంప్యూటర్ సైన్స్ వంటి కోర్సుల్లో చేరవచ్చు. ఏప్రిల్ 25న రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సెంటర్లలో పాలిసెట్ ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి.

ఏపీ పాలిసెట్ 2026..వివరాలు

ముఖ్యమైన కోర్సులు:
డిప్లొమాలో ప్రస్తుతం డిమాండ్ ఉన్న అనేక కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

కంప్యూటర్ ఇంజనీరింగ్: ఐటీ రంగంపై ఆసక్తి ఉన్నవారికి బెస్ట్ ఛాయిస్.

ఈసీఈ & ఈఈఈ: ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ విభాగాల్లో రాణించాలనుకునే వారికి ఉపయోగకరం.

మెకానికల్ & సివిల్: కోర్ ఇంజనీరింగ్ రంగాల్లో స్థిరపడాలనుకునే వారికి బెస్ట్.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్: మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కొత్త కోర్సులు కూడా అందుబాటులోకి వచ్చాయి.

అప్లికేషన్ ఫీజు:

ఓసీ,బీసీ అభ్యర్థులు రూ. 400 చెల్లించాలి.

ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ. 100 చెల్లించాలి.

పరీక్షా సరళి:
ఏప్రిల్ 25న నిర్వహించే ఈ పరీక్షలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు వస్తాయి. మొత్తం 120 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇందులో సాధించే ర్యాంక్ ఆధారంగానే మీకు నచ్చిన కాలేజీలో సీటు లభిస్తుంది

అప్లికేషన్ విధానం:

1.ముందుగా ఏపీ పాలిసెట్ అధికారిక వెబ్‌సైట్ polycetap.nic.in లోకి లాగిన్ అవ్వండి.

3.అనంతరం 'Fill Application' బటన్ మీద క్లిక్ చేయండి. ఇందులో మీ వ్యక్తిగత వివరాలు (పేరు, తండ్రి పేరు, అడ్రస్), ఆధార్ నంబర్ వంటి వివరాలను జాగ్రత్తగా ఎంటర్ చేయండి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Merupulu