దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీల్లో సీట్లే లక్ష్యంగా జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాసిన అభ్యర్థులకు ఐఐటీ రూర్కీ ఒక ముఖ్యమైన అప్‌డేట్ ఇచ్చింది. జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ కీతో పాటు, అభ్యర్థుల రికార్డెడ్ రెస్పాన్స్ షీట్లను మే 25న (సోమవారం) అధికారికంగా విడుదల చేయనున్నారు.
పరీక్ష రాసిన అభ్యర్థులు తమ మార్కులను అంచనా వేసుకోవడానికి ఈ కీ ఎంతో సహాయపడుతుంది.
ప్రిలిమినరీ కీ, రెస్పాన్స్ షీట్లను డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా?
పరీక్షకు హాజరైన అభ్యర్థులు రేపు (మే 25న) ప్రిలిమినరీ కీ విడుదలైన తర్వాత ఆన్‌లైన్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.
1.ముందుగా అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్డ్ అధికారిక వెబ్‌సైట్ అయిన jeeadv.ac.in లోకి లాగిన్ అవ్వాలి.
మే 17న విజయవంతంగా ముగిసిన పరీక్షలు:
దేశ వ్యాప్తంగా ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు మే 17న విజయవంతంగా పూర్తయ్యాయి. ఐఐటీ రూర్కీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎగ్జామ్‌లో భాగంగా.. ఉదయం పూట పేపర్-1, మధ్యాహ్నం పూట పేపర్-2 పరీక్షలను కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో నిర్వహించారు. ఈ పరీక్షకు సంబంధించిన క్వశ్చన్ పేపర్లను ఇప్పటికే వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులో ఉంచారు.
జేఈఈ మెయిన్ పరీక్షల్లో టాప్ కటాఫ్ మార్కులు సాధించి, అర్హత సాధించిన క్రీమీలేయర్ అభ్యర్థులు మాత్రమే ఈ జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు హాజరయ్యారు. ఈ ప్రాథమిక కీ పై ఏవైనా అభ్యంతరాలు ఉంటే వాటిని నిర్ణీత గడువులోగా ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది.

