Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రేపే పాలిసెట్ ఫలితాలు.. కౌన్సెలింగ్ వివరాలు ఇవే!

రేపే పాలిసెట్ ఫలితాలు.. కౌన్సెలింగ్ వివరాలు ఇవే!

Merupulu 3 days ago

పాలిటెక్నిక్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. తెలంగాణ పాలిసెట్ (POLYCET-2026), ఎల్‌పిసెట్ (LPCET-2026) ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసిన స్టూడెంట్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న రిజల్ట్స్ డేట్ వచ్చేసింది.

మే 23(రేపు) ఉదయం 11:30 గంటలకు హైదరాబాద్, మాసబ్ ట్యాంక్‌లోని ఎస్.వి.భవన్‌లో ఉన్న స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (SBTET) కార్యాలయంలో ఈ ఫలితాలను అధికారికంగా విడుదల చేయనున్నారు.

ఫలితాల విడుదల:
రేపు ఉదయం రిజల్ట్స్ అనౌన్స్ చేసిన వెంటనే విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ సహాయంతో అధికారిక వెబ్‌సైట్ ద్వారా ర్యాంక్ కార్డ్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

కౌన్సెలింగ్ షెడ్యూల్:

తెలంగాణ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీ పాలీసెట్) 2026 అడ్మిషన్ల షెడ్యూల్‌ను సాంకేతిక విద్యా శాఖ ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే.. కౌన్సెలింగ్ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు..

ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్:
ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రక్రియ మే 27 నుంచి ప్రారంభం కానుంది.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ & స్లాట్ బుకింగ్: మే 21 నుంచి మే 31 వరకు.

సర్టిఫికేట్ వెరిఫికేషన్: మే 29 నుంచి జూన్ 1 వరకు.

వెబ్ ఆప్షన్ల నమోదు: మే 29 నుంచి జూన్ 3 వరకు.

తాత్కాలిక సీట్ల కేటాయింపు: జూన్ 6న (లేదా అంతకంటే ముందే).

ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు & సెల్ఫ్ రిపోర్టింగ్: జూన్ 6 నుంచి జూన్ 9 వరకు.

కళాశాలల్లో రిపోర్టింగ్: జూన్ 8, 9 తేదీలలో..

గమనిక: 2026-27 విద్యా సంవత్సరానికి గానూ జూన్ 9 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. జూన్ 9, 10 తేదీలలో విద్యార్థులకు ఓరియెంటేషన్ కార్యక్రమం నిర్వహించనున్నారు.

ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్:
ఫస్ట్ ఫేజ్ తర్వాత మిగిలిపోయిన సీట్ల భర్తీ కోసం నిర్వహించే ఫైనల్ ఫేజ్ వివరాలు:

స్లాట్ బుకింగ్ (రిజిస్ట్రేషన్): జూన్ 15

సర్టిఫికేట్ వెరిఫికేషన్: జూన్ 16

వెబ్ ఆప్షన్ల నమోదు: జూన్ 16, 17

తాత్కాలిక సీట్ల కేటాయింపు: జూన్ 20న (లేదా అంతకంటే ముందే)

ఫీజు చెల్లింపు & ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్: జూన్ 20- 22 వరకు

కేటాయించిన కాలేజీల్లో రిపోర్టింగ్: జూన్ 22, 23.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Merupulu