తెలంగాణలో పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసిన విద్యార్థులకు అలర్ట్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీజీ టెన్త్ సప్లిమెంటరీ ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది.
రేపు.. అంటే జూన్ 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఈ రిజల్ట్స్‌ను అధికారికంగా రిలీజ్ చేయనున్నారు. అఫీషియల్ వెబ్‌సైట్ల ద్వారా విద్యార్థులు తమ స్కోర్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
తెలంగాణ టెన్త్ రెగ్యులర్ ఫలితాల్లో కొద్ది మార్కులతో వెనుకబడిన విద్యార్థుల కోసం రాష్ట్ర విద్యాశాఖ జూన్ 5వ తేదీ నుంచి జూన్ 12వ తేదీ వరకు పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 31,542 మంది విద్యార్థులు ఫీజు చెల్లించగా.. వారిలో 17,768 మంది (56.33 శాతం) అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షలు ముగిసిన కొద్ది రోజుల్లోనే వాల్యుయేషన్ ప్రక్రియను శరవేగంగా పూర్తి చేసిన బోర్డు, రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాలను అనౌన్స్ చేయబోతోంది.
ఫలితాలు విడుదలైన వెంటనే.. అఫీషియల్ వెబ్‌సైట్ bse.telangana.gov.in విజిట్ చేయవచ్చు. అక్కడ హోమ్ పేజీలో కనిపించే 'TS SSC Supplementary Results 2026' డైరెక్ట్ లింక్‌పై క్లిక్ చేసి, మీ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే చాలు, మీ మార్కుల మెమో స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతుంది.

