Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సెట్ అప్లికేషన్ గడువు పొడిగింపు..సెప్టెంబర్ 5 వరకు అవకాశం!

సెట్ అప్లికేషన్ గడువు పొడిగింపు..సెప్టెంబర్ 5 వరకు అవకాశం!

Merupulu 2 days ago

రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలు, డిగ్రీ కాలేజీలలో లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హత సాధించాలంటే 'సెట్' అర్హత సాధించాల్సి ఉంటుంది.

ఇదిలా ఉంటే.. ఇటీవల సెట్ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే అయితే.. ఈ పరీక్షకు అప్లై చేసుకునే అభ్యర్థుల కోసం అధికార వర్గాలు కీలక ప్రకటన చేసాయి. చాలా మంది విద్యార్థులు వివిధ కారణాల వల్ల గడువులోగా అప్లై చేసుకోలేకపోవడంతో.. వారి విజ్ఞప్తి మేరకు గడువును పొడిగించారు. ఎలాంటి లేట్ ఫీజు లేకుండా సెప్టెంబర్ 5వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు..

పరీక్ష ఫీజు:

రూ.1500 లేట్ ఫీజుతో అభ్యర్థులు సెప్టెంబర్ 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. అంతే కాకుండా రూ.2వేల లేట్ ఫీజుతో సెప్టెంబర్9,10తేదీల్లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదిలా ఉంటే.. రూ.3వేల లేట్ ఫీజుతో సెప్టెంబర్ 11,12 తేదీల్లో అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు ఈ నెల 13 నుంచి15వ తేదీ వరకు అప్లికేషన్ ఎడిట్ చేసుకోవడానికికి అవకాశం ఉంటుంది.

అప్లికేషన్ గడువు పూర్తయిన తర్వాత సెప్టెంబర్ 24వ తేదీ నుంచి అభ్యర్థుల హాల్ టికెట్లను అధికారిక సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. సెప్టెంబర్ 28,29,30 తేదీల్లో ఈ అర్హత పరీక్షలను నిర్వహించేందుకు బోర్డు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది

పరీక్షా విధానం, మార్కుల వెయిటేజీ:

ఈసారికూడా టీజీ సెట్ పరీక్షను పూర్తిగా కంప్యూటర్ ఆధారిత విధానంలోనే నిర్వహిస్తున్నారు. ఈ ఎగ్జామ్‌లో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి.

పేపర్-1: ఇది అందరికీ కామన్ పేపర్ ఉంటుంది. అభ్యర్థుల సాధారణ జ్ఞానం, బోధనా ,పరిశోధనా నైపుణ్యాలను పరీక్షించేలా 50 ప్రశ్నలు ఇస్తారు. వీటికి 100 మార్కులు కేటాయించారు.

పేపర్-2: అభ్యర్థి పీజీ సబ్జెక్టు నుంచి ప్రశ్నలు వస్తాయి. దీని నుంచి మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు. వీటికి 200 మార్కులు ఉంటాయి.

మొత్తంగా రెండు పేపర్లు కలిపి 300 మార్కులకు ఈ పరీక్ష జరుగుతుంది. పరీక్ష రాయడానికి అభ్యర్థులకు మొత్తం 3 గంటల సమయం కేటాయించారు. చివరి నిమిషంలో.. సర్వర్ సమస్యలు తలెత్తే అవకాశం ఉండటం వల్ల అర్హులైన అభ్యర్థులు వీలైనంత త్వరగా అప్లికేషన్ ప్రక్రియను ముగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్లు ద్వారా అప్లై చేసుకోవచ్చు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Merupulu