బీఈడీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన టీజీ ఎడ్ సెట్ (TG EdCET 2026) రాసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఈ పరీక్ష ఫలితాలు అధికారికంగా విడుదలయ్యాయి.
మే 12న రాష్ట్రవ్యాప్తంగా ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రాథమిక కీ విడుదల చేసి, అభ్యంతరాలను స్వీకరించిన అధికారులు నేడు ఫైనల్ రిజల్ట్స్ వెల్లడించారు. ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి, కాకతీయ విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య ప్రతాప్రెడ్డి చేతుల మీదుగా ఈ ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు తమ ర్యాంక్ కార్డలను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
పరీక్షకు హాజరైన అభ్యర్థుల వివరాలు:
ఈ ఏడాది ఎడ్సెట్ పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 35,600 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 29,342 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో (CBT) రెండు సెషన్లలో ఈ పరీక్ష జరిగింది. పరీక్ష రాసిన అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లు, కీపై వచ్చిన అభ్యంతరాలను నిపుణుల కమిటీ పరిశీలించిన తర్వాతే ఈ తుది ఫలితాలను ,ఫైనల్ కీని విడుదల చేశారు.
మీ ర్యాంక్ కార్డ్ ఎలా చూసుకోవాలి?
1.ముందుగా ఎడ్ సెట్ అధికారిక వెబ్‌సైట్ edcet.tgche.ac.in ఓపెన్ చేయాలి.
3.అక్కడ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేయాలి.
తదుపరి ప్రక్రియ - కౌన్సిలింగ్:
ఎడ్సెట్ ఫలితాలు వచ్చేసాయి కాబట్టి, త్వరలోనే బీఈడీ కాలేజీల్లో సీట్ల భర్తీకి సంబంధించిన కౌన్సిలింగ్ షెడ్యూల్‌ను అధికారులు ప్రకటించనున్నారు. జూన్ నెలలో మొదటి విడత కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అభ్యర్థులు తమ సర్టిఫికెట్లను సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచించారు.

