Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలంగాణ పాలిసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే!

తెలంగాణ పాలిసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే!

Merupulu 5 days ago

రాష్ట్రంలోని పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు కీలక అప్‌డేట్ వచ్చేసింది. హైదరాబాద్‌లోని నాంపల్లి విద్యా భవన్‌లో జరిగిన అడ్మిషన్ కమిటీ సమావేశంలో కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను అధికారికంగా ఖరారు చేశారు.

ఈ నేపథ్యంలోనే 2026 విద్యాసంవత్సరానికి గాను ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో సీట్ల భర్తీకి సంబంధించిన ఫేజ్-1, ఇంటర్నల్ స్లైడింగ్ ,స్పాట్ అడ్మిషన్ల పూర్తి వివరాలను ప్రకటించారు.

TGPOLYCET-2026 కౌన్సెలింగ్ ప్రక్రియ:

మొదటి విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ (First Phase):
ఇంజనీరింగ్, నాన్-ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సుల్లో చేరడానికి మొదటి విడత ప్రక్రియ మే నెలాఖరు నుంచి ప్రారంభమవుతుంది.

1.ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు & స్లాట్ బుకింగ్: మే 27 నుంచి మే 31 వరకు.

అభ్యర్థులు వెబ్‌సైట్‌లో అవసరం అయిన వివరాలు ఎంటర్ చేసి, ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం తమకు నచ్చిన హెల్ప్ లైన్ సెంటర్ (HLC), తేదీ, సమయాన్ని బుక్ చేసుకోవాలి.

2.డాక్యుమెంట్ వెరిఫికేషన్: మే 29నుంచి జూన్ 1 వరకు.

ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకున్న అభ్యర్థులు హెల్ప్ లైన్ కేంద్రాలకు వెళ్లి ఒరిజినల్ సర్టిఫికేట్లను వెరిఫై చేయించుకోవాలి.

3.వెబ్ ఆప్షన్లు: మే 29 నుంచి జూన్ 3 వరకు.
సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన వారు తమకు నచ్చిన కాలేజీలు, కోర్సులను ప్రాధాన్యత క్రమంలో వెబ్‌సైట్‌లో ఎంచుకోవాలి.

అభ్యర్థులు ఎంచుకున్న ఆప్షన్లను మార్చుకోవడానికి ఇది ఆఖరి రోజు. ఈ రోజుతో ఆప్షన్లు లాక్ అయిపోతాయి.

మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా విద్యార్థులకు ఏ కాలేజీలో సీటు వచ్చిందో వెబ్‌సైట్‌లో ప్రకటిస్తారు.

సీటు పొందిన అభ్యర్థులు వెబ్‌సైట్ ద్వారా ట్యూషన్ ఫీజు చెల్లించి, ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి.

7.సెల్ఫ్ రిపోర్ట్ చేయడం: జూన్ 8,9.

అలాట్‌మెంట్ ఆర్డర్, ఫీజు రసీదులతో విద్యార్థులు తమకు కేటాయించిన కాలేజీకి వెళ్లి అడ్మిషన్ ఖరారు చేసుకోవాలి.

కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం: జూన్ 9 నుంచి తరగతులు మొదలవుతాయి.

ఓరియంటేషన్ క్లాసులు: జూన్ 9, 10 తేదీల్లో కొత్తగా చేరిన అభ్యర్థులకు కాలేజీ వాతావరణం, కోర్సులపై అవగాహన సదస్సులు నిర్వహిస్తారు.

చివరి విడత రిజిస్ట్రేషన్ & స్లాట్ బుకింగ్:

జూన్ 15 (మొదటి విడతలో పాల్గొనని వారు మాత్రమే ఈ రోజు ఫీజు చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవాలి).

చివరి విడత సర్టిఫికేట్ వెరిఫికేషన్:

జూన్ 16 న స్లాట్ బుక్ చేసుకున్న వారికి సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరుగుతుంది.

వెబ్ ఆప్షన్ల నమోదు:

జూన్ 16, 17తేదీల్లో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు.

ఆప్షన్ల ఫ్రీజింగ్: జూన్ 17 న ఆప్షన్లు లాక్ అవుతాయి.

చివరి విడత సీట్ల కేటాయింపు: జూన్ 20 లేదా అంతకంటే ముందే సీట్లు కేటాయిస్తారు.

ఫీజు చెల్లింపు & ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్:జూన్ 20 నుంచి జూన్ 22 వరకు ఆన్‌లైన్‌లో ఫీజు కట్టి రిపోర్ట్ చేయాలి.

కాలేజీలో స్వయంగా రిపోర్ట్ చేయడం: జూన్ 22, 23 తేదీల్లో కేటాయించిన కాలేజీకి వెళ్లి జాయిన్ అవ్వాలి.

కాలేజీల అప్‌డేట్: జూన్ 24 లోగా చేరిన అభ్యర్థుల వివరాలను కాలేజీ యాజమాన్యాలు కన్వీనర్ కోటాలో ఆన్‌లైన్ ద్వారా అప్‌డేట్ చేయాలి.

సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ (అంతర్గత బ్రాంచ్ మార్పు):
ఇది ఇప్పటికే ఒక కాలేజీలో సీటు పొంది చేరిన విద్యార్థులు, అదే కాలేజీలో ఖాళీగా ఉన్న వేరే బ్రాంచ్ (కోర్సు) కి మారే ప్రక్రియ. దీనికి కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫీజ్ రీయింబర్స్‌మెంట్ వర్తిస్తుంది.

స్లైడింగ్ ఆప్షన్ల నమోదు: జూన్ 27,28 తేదీల్లో ఆన్‌లైన్‌లో ఆప్షన్లు ఇచ్చుకోవాలి.

సీట్ల కేటాయింపు: జూన్ 30 న లేదా అంతకంటే ముందే కొత్త బ్రాంచ్ సీటును ఖరారు చేస్తారు.

కొత్త బ్రాంచ్‌లో రిపోర్టింగ్: జులై 1 న అభ్యర్థులు కొత్త అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకుని, తమ కాలేజీలోనే కొత్తగా వచ్చిన బ్రాంచ్‌లో చేరాలి.

స్పాట్ అడ్మిషన్లు (Spot Admissions):
కౌన్సెలింగ్ అంతా అయిపోయాక ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో మిగిలిపోయిన సీట్లను డైరెక్ట్‌గా భర్తీ చేసే ప్రక్రియ.

మార్గదర్శకాల విడుదల: జులై 1న స్పాట్ అడ్మిషన్ల గైడ్‌లైన్స్‌ను అధికారిక వెబ్‌సైట్ https://tgpolycet.nic.in లో ఉంచుతారు. కాలేజీల ప్రిన్సిపాళ్లు దీని ప్రకారం సీట్లు భర్తీ చేస్తారు.

స్పాట్ అడ్మిషన్ల ముగింపు: జులై 08 నాటికి రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాలిటెక్నిక్ కాలేజీలలో స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తవుతుంది.

నోటిఫికేషన్, హెల్ప్ లైన్ కేంద్రాల లిస్ట్, కోర్సుల వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ tgpolycet.nic.in ను సందర్శించాలని కన్వీనర్ తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Merupulu