Dailyhunt
టెన్త్ అర్హతతో.. అంగన్వాడీ పోస్టులు

టెన్త్ అర్హతతో.. అంగన్వాడీ పోస్టులు

Merupulu 1 week ago

వైఎస్ఆర్ కడప జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ (WCD) 171 అంగన్‌వాడీ కార్యకర్త, సహాయక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో 30 కార్యకర్త, 141 సహాయకుల పోస్టులు ఉన్నాయి.

టెన్త్ పాసై, 21 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న స్థానిక మహిళలు ఈ ఉద్యోగాలకు అర్హులు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు అప్లికేషన్ ఫారమ్ అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని, పూర్తి వివరాలతో ఏప్రిల్ 13 లోపు ఆఫ్‌లైన్‌లో అప్పగించాలి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి వివరాలు:
సంస్థ పేరు- మహిళా శిశు సంక్షేమ శాఖ, కడప
పోస్టుల పేర్లు- అంగన్‌వాడీ కార్యకర్త (AWW), అంగన్‌వాడీ సహాయకురాలు (AWH)

ఖాళీల వివరాలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 171 పోస్టులను భర్తీ చేస్తున్నారు.

అంగన్‌వాడీ కార్యకర్తలు: 30 పోస్టులు

అంగన్‌వాడీ సహాయకులు: 141 పోస్టులు

అర్హతలు & వయస్సు :
విద్యార్హత:
అభ్యర్థులు తప్పనిసరిగా టెన్త్ (SSC) పాసై ఉండాలి. దీంతో పాటు ప్రీ-స్కూల్ టీచర్ ట్రైనింగ్ లేదా క్రెచ్ మేనేజ్‌మెంట్ ట్రైనింగ్ సర్టిఫికేట్ కలిగి ఉంటే.. అదనపు అర్హతగా పరిగణిస్తారు.

స్థానికత: అప్లై చేసుకునే మహిళలు తప్పనిసరిగా సంబంధిత గ్రామం లేదా వార్డుకు చెందిన స్థానిక నివాసి అయి ఉండాలి.

వయస్సు:01-07-2026 నాటికి అభ్యర్థి వయస్సు 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. (నిబంధనల ప్రకారం వయోపరిమితి సడలింపులు ఉంటాయి).

ఎంపిక విధానం:
అభ్యర్థుల ఎంపిక మెరిట్ మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది.

టెన్త్ లో వచ్చిన మార్కులకు వెయిటేజీ ఉంటుంది.

ఇంటర్వ్యూ : ఏప్రిల్ 23న నిర్వహించే అవకాశం ఉంది.

అప్లికేషన్ అందజేయడానికి చివరి తేదీ: ఏప్రిల్ 13

అప్లికేషన్ ప్రక్రియ:
ఆఫ్‌లైన్ ద్వారానే అప్లై చేసుకోవాలి.

1.ముందుగా అధికారిక వెబ్‌సైట్ kadapa.ap.gov.in నుంచి అప్లికేషన్ ఫారమ్‌ డౌన్‌లోడ్ చేసుకోండి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Merupulu