Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
టీచర్లకు గుడ్ న్యూస్.. టెట్ పై సుప్రీంకోర్టు కీలక తీర్పు

టీచర్లకు గుడ్ న్యూస్.. టెట్ పై సుప్రీంకోర్టు కీలక తీర్పు

Merupulu 2 weeks ago

ర్వీసు టీచర్లకు టెట్ అర్హత సాధించేందుకు గడువును సుప్రీం కోర్టు మరో ఏడాది పొడగించింది. ఐదేళ్ల పాటు సర్వీసు ఉన్నవాళ్లతో పాటు ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్న టీచర్లకు టెట్ పరీక్ష తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

దీనికి మొదటగా ఆగస్టు 2027 వరకు గడువు విధించింది. ఆ లోపు టెట్ అర్హత సాధించని టీచర్లపై అన్హత వేటు వేస్తామని ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా దీనిపై పలు ఉపాధ్యాయ సంఘాలు కోర్టులో పిటిషన్లు వేశారు.తమకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు.

ఈ పిటిషన్ల పై విచారించిన సుప్రీంకోర్టు టీచర్లకు టెట్ పరీక్ష తప్పందంటూ.. శుక్రవారం తీర్పు వెల్లడించింది. అయితే సమయం.. వనరులు పరిమితంగా ఉన్న కారణంగా గడువును మరో ఏడాది అంటే ఆగస్టు 31, 2028 వరకు పొడగిస్తున్నట్టు పేర్కొంది.. ఆర్టీఐ యాక్ట్ అమల్లోకి రాక ముందు సర్వీసులో ఉన్న టీచర్లకు టెట్ అర్హత సాధించేందుకు సమయం ఉందని, టెట్ అర్హత లేని ఉపాధ్యాయులు సర్వీసులో కొనసాగడం రాబోయే తరాల విద్యా భవిష్యత్ పై ప్రభావం చూపుతుందని కోర్టు అభిప్రాయపడింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Merupulu