Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
టీజీ ఎడ్‌సెట్ సెకండ్ ఫేస్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల..పూర్తి వివరాలు ఇవే!

టీజీ ఎడ్‌సెట్ సెకండ్ ఫేస్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల..పూర్తి వివరాలు ఇవే!

Merupulu 2 weeks ago

బీఈడీ అడ్మిషన్ల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. టీజీ ఎడ్ సెట్-2026 సెకండ్&ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఫస్ట్ ఫేజ్‌లో అవకాశం రానివారు లేదా ఇంత వరకు రిజిస్ట్రేషన్ చేసుకోని వారు సెప్టెంబర్ 3 వరకు ఆన్‌ లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

అంతే కాకుండా సెప్టెంబర్ 6 నుంచి 8 వరకు వెబ్ ఆప్షన్లు ఎంటర్ చేసుకోవడానికి,9న ఎడిట్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఇదిలా ఉంటే.. సెప్టెంబర్ 12న సీట్ల కేటాయింపు లిస్ట్ విడుదలవుతుంది. సీటు పొందిన అభ్యర్థులు సెప్టెంబర్ 15 నుంచి 19 లోపు సంబంధిత కాలేజీల్లో ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు రిపోర్ట్ చేయాలని అధికారులు స్పష్టం చేశారు.

కౌన్సెలింగ్ షెడ్యూల్ వివరంగా..

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ అప్‌లోడ్:
ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోయిన లేదా ఇప్పటి వరకు అప్లై చేయని అభ్యర్థులకు ఇది చివరి అవకాశం. సెప్టెంబర్ 3 వరకు అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ సమయంలో.. నిర్దేశిత ప్రాసెసింగ్ ఫీజును ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి. అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు,కాస్ట్, ఇన్ కమ్‌తో పాటు ఇతర ఒరిజినల్ సర్టిఫికెట్ల స్కానింగ్ కాపీలను వెబ్‌ సైట్‌లో తప్పకుండా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

వెరిఫైడ్ లిస్ట్,ఎడిట్ ఆప్షన్:

సెప్టెంబర్ 5: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకున్న అభ్యర్థుల సర్టిఫికెట్లను అధికారులు పరిశీలిస్తారు. అర్హులైన రిజిస్టర్డ్ అభ్యర్థుల ఫైనల్ వెరిఫైడ్ లిస్ట్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. ఒకవేళ ఈ లిస్ట్ లో అభ్యర్థుల పేర్లు,మార్కులు లేదా ఇతర వివరాలలో ఏవైనా తప్పులు ఉన్నట్లయితే.. వాటిని సరిదిద్దుకోవడానికి ప్రత్యేకంగా ఈ-మెయిల్ సర్వీస్ అవకాశాన్ని అందిస్తారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ వివరాలను ఎడిట్ చేసుకోవచ్చు.

వెబ్ ఆప్షన్లు:
సెప్టెంబర్ 6 నుంచి 8 వరకు: అభ్యర్థులు తమకు నచ్చిన కాలేజీలు, కోర్సులను ప్రాధాన్యత క్రమంలో ఎంచుకోవడానికి 'వెబ్ ఆప్షన్లు' ఎంటర్ చేసుకోవాలి. వీలైనన్ని ఎక్కువ కాలేజీలను ఆప్షన్లుగా ఇస్తే.. సీటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

సెప్టెంబర్ 9: అభ్యర్థులు తాము ఇచ్చిన వెబ్ ఆప్షన్లలో.. ఏవైనా మార్పులు, చేర్పులు చేసుకోవడానికి.. ఒక రోజు మాత్రమే అవకాశం ఉంటుంది. ఈ గడువులోగా.. కాలేజీల ప్రాధాన్యత క్రమాన్ని మార్చుకోవచ్చు. లేదా కొత్త వాటిని యాడ్ చేసుకోవచ్చు.

సీట్ల కేటాయింపు, రిపోర్టింగ్:

సెప్టెంబర్ 12: అభ్యర్థులు ఎంటర్ చేసిన వెబ్ ఆప్షన్ల ఆధారంగా కాలేజీల వారీగా తాత్కాలికంగా ఎంపికైన అభ్యర్థుల లిస్ట్ వెబ్‌సైట్‌లో ప్రకటిస్తారు.

సెప్టెంబర్ 15 నుంచి 19 వరకు: సీట్లు పొందిన అభ్యర్థులు నిర్ణయించిన గడువులోగా సంబంధిత కాలేజీలకు వెళ్లాలి. కాలేజీలో అడ్మిషన్ తీసుకునే సమయంలో అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లను అధికారులకు చూపించి వెరిఫికేషన్ చేయించుకోవాలి. అంతే కాకుండా.. ఆన్‌లైన్‌లో ట్యూషన్ ఫీజు చెల్లించిన రిసిప్ట్ కచ్చితంగా కాలేజీలో సబ్‌మిట్ చేసి, తమ అడ్మిషన్‌ను కన్ఫామ్ చేసుకోవాలని అధికారులు స్పష్టం చేసారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Merupulu