రాష్ట్రంలోని లా కాలేజీల్లో ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో చేరానుకునే వారికి మరో చక్కటి అవకాశం. మొదటి విడత కౌన్సెలింగ్‌లో సీటు రాని అభ్యర్థులు నేటి నుంచి ప్రారంభం అయ్యే..
సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొనవచ్చు. లా ప్రవేశ పరీక్షలో అర్హత సాధించి, ఇప్పటివరకు సీటు రాని అభ్యర్థులు, అలాగే మొదటి విడతలో పాల్గొనలేకపోయిన వారు ఈ ఫేజ్ కు అర్హులని అధికారులు తెలిపారు.
ఈ సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రక్రియకు సంబంధించి తాజాగా కన్వీనర్ పూర్తి షెడ్యూల్‌ను ప్రకటించారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు చేసుకోవడం,సర్టిఫికేట్ వెరిఫికేషన్ , ప్రాసెసింగ్ ఫీజు చెల్లించడానికి ఈ నెల 22 వరకు అవకాశం కల్పించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత.. అభ్యర్థులు తమకు నచ్చిన కాలేజీలను ఎంచుకోవడానికి వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ ఉంటుంది. ఈ నెల 23 నుంచి 25 వరకు వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఒక వేళ ఆప్షన్స్‌లో ఏవైనా మార్పులు చేసుకోవాలనుకుంటే.. ఈ నెల 26వ తేదీన వెబ్ ఆప్షన్స్ ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
అన్ని ప్రక్రియలు పూర్తయిన తర్వాత, ఆగస్టు 29న సెకండ్ ఫేజ్ సీట్ల కేటాయింపు ఉంటుంది సీటు పొందిన విద్యార్థులు ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 5వ తేదీ లోపు సంబంధిత కాలేజీల్లో రిపోర్ట్ చేసి, అడ్మిషన్ పూర్తి చేసుకోవాలని కన్వీనర్ స్పష్టం చేశారు.

