యూనివర్సిటీ గ్రాండ్స్ కమిషన్ నేషనల్ ఎలిజిలిటీ టెస్ట్ జూన్ 2026 పరీక్ష షెడ్యూల్ విడుదలైంది. యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పోటీపడేందుకు అంతే కాకుండా పీహెచ్డీ అడ్మిషన్లకు ఉపయోగపడే ఈ పరీక్షను జూన్ 22 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు యూజీసీ వెల్లడించింది.
85 సబ్జెక్టులకు ఈ పరీక్షలను ఎన్టీఏ నిర్వహించనుంది. ఆన్లైన్ లో మే 20వ తేదీ వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
అర్హత: అభ్యర్థులు 55 శాతం మార్కులతో డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. ఓబీసీ,ఎస్సీ, ఎస్టీ,దివ్యాంగులు, థర్డ్ జెండర్స్ కేటగిరీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు వచ్చి ఉండాలి.
వయస్సు: జేఆర్ఎఫ్‌కు 30 ఏళ్లు మించకూడదు. అసిస్టెంట్ ప్రొఫెసర్ ,పీహెచ్డీ ప్రవేశాలకు గరిష్ట వయో పరిమితి లేదు.
అప్లికేషన్ ఫీజు:
జనరల్ అన్ రిజర్వ్డ్ అభ్యర్థులు రూ.1150 జనరల్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ ఎస్ సీఎల్ రూ. 600.. ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులు థర్డ్ జెండర్స్ రూ.325 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
ఆన్ లైన్ అప్లికేషన్లకు చివరి తేదీ: మే 20 వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
అప్లికేషన్ ఎడిట్ అవకాశం: మే 22 నుంచి 24 వరకు అప్లికేషన్లు ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
పరీక్ష తేదీలు: జూన్ 22 నుంచి 30వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి.

