Wednesday, 05 Aug, 10.22 am మైక్ TV

హోమ్
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీ

లాక్‌డౌన్ దెబ్బతో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఉపాధి లేక, కోచింగ్ తీసుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ఈ సమయంలో నిరుద్యోగులకు బ్యాంకింగ్ సెక్టార్ అద్భుతమైన అవకాశం కల్పించింది. వివిధ బ్యాంకుల్లో ఖాళీలను భర్తీ చేయడానికి ఐబీపీఎస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దాదాపు 1167 పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించింది. దీంతో బ్యాంకింగ్ కోసం ప్రిపేర్ అవుతున్న వారికి శుభవార్త లభించినట్టు అయింది.

1167 ప్రొబెషనరీ ఆఫీసర్లు, మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా లో 734, పంజాబ్‌ అండ్‌ సింథ్‌ బ్యాంక్‌ లో 83, యుకో బ్యాంక్‌ లో 350 ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆగస్టు 5 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభవుతుందని తెలిపింది. ఈ నెల 26వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే వీలు కల్పించారు. డిగ్రీ ఉత్తీర్ణత సాధించి, 20 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తిగలవారు మిగితా వివరాల కోసం https://www.ibps.in/ క్లిక్ చేయండి.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: MIC TV
Top