Wednesday, 03 Jun, 10.31 pm మైక్ TV

హోమ్
వ్యాపారవేత్తతో నటి నిశ్చితార్థం

ప్రముఖ మళయాల నటి త్వరలో పెళ్లిపీటలు ఎక్కనుంది. నటి మియా జార్జ్ నిశ్చితార్థం వ్యాపారవేత్త అశ్విన్ ఫిలిప్‌తో జరిగింది. కరోనా కారణంగా అతి కొద్దిమంది కుటుంబ సభ్యుల సమక్షంలో కొట్టాయంలోని ఫిలిప్ నివాసంలో ఈ శుభకార్యం జరిగింది. నిన్న జరిగిన ఈ కార్యక్రమంలో మియా, ఫిలిప్ ఉంగరాలు మార్చుకున్నారు. ఈ విషయాన్ని మియా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వెల్లడిస్తూ ఫిలిప్‌తో కలిసి ఉన్న ఫొటోను పంచుకుంది.

కాగా, వీరిద్దరి వివాహం ఈ ఏడాది సెప్టెంబరులో జరగనున్నట్టు తెలుస్తోంది. తొలుత టీవీ నటిగా తన నటప్రస్థానాన్ని ప్రారంభించింది మియా. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి తనకుంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. 2014లో 'అమరకావ్యం' అనే సినిమాతో తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం చియాన్ విక్రమ్ 'కోబ్రా' సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: MIC TV
Top
// // // // $find_pos = strpos(SERVER_PROTOCOL, "https"); $comUrlSeg = ($find_pos !== false ? "s" : ""); ?>