"సినిమాలు చేసుకోక.. నీకెందుకురా రాజకీయాలు?" ఇది రోజా ఇద్దరు ముగ్గురు హీరోలు పాలిటిక్స్ లోకి వచ్చేందుకు ప్రయత్నించినప్పుడు లేదా అదే హీరోలు రాజకీయంగా ఎదుగుతున్నప్పుడు వేసిన డైలాగ్.
ఫైర్ బ్రాండ్ గా అందరికీ తెలిసిన రోజా 2013 తర్వాత సినిమాల్లో నటించడం మానేసింది.
అప్పటివరకు తనని పెంచి పోషించిన జబర్దస్త్ షోలు కూడా చేయడం మానేసింది. ముఖ్యంగా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి దాదాపుగా దూరమైంది. అందుకు కారణం ప్రతిపక్ష పార్టీల నుండి వచ్చిన ప్రశ్నాత్రాలే.
అయితే.. బుల్లితెర మీద మాత్రం ఎప్పటికప్పుడు కనిపిస్తూనే ఉంది రోజా. కానీ.. 2024లో అధికారం కోల్పోయిన తర్వాత మాత్రం మెల్లమెల్లగా సినిమాలవైపు ఆసక్తి చూపించడం మొదలెట్టింది.
అందులో భాగంగానే తమిళంలో ఇటీవల విడుదలైన "అన్బే డయానా" అనే సినిమాలో తల్లి పాత్రలో రీఎంట్రీ ఇచ్చింది. తమిళనాడులో సెటిలైన తెలుగు కుటుంబంలో భార్యగా, తల్లిగా ఆమె నటనకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకు కారణం రోజా రియల్ ల్లైఫ్ బిహేవియర్ కి ఆ పాత్ర చాలా దగ్గరగా ఉండడం.
ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరిగా పర్ఫార్మ్ చేయలేకపోయింది, అది వేరే విషయం అనుకోండి. ఇప్పుడు తమిళంలో రోజా మరో రెండు సినిమాలు సైన్ చేసింది. ఒక సినిమా ఫస్ట్ లుక్ కూడా రీసెంట్ గా రిజీలైంది.
మళ్లీ ఎలక్షన్స్ జరగాలన్నా, ఆమె మళ్లీ అధికారం కోసం ప్రయత్నించాలన్నా ఇంకో మూడేళ్లు పడుతుంది. ఈలోపు వీలైనన్ని సినిమాలు చేసేస్తుందా లేక ఇలానే కంటిన్యూ చేస్తుందా? అనేది చూడాలి.
కాకపోతే.. బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ వంటి వాళ్ల మీద సినిమాలు చేస్తున్నందుకు తెగ ఎగిరిన రోజా, ఇప్పుడు మాత్రం సైలెంట్ గా సినిమాలు సైన్ చేస్తూ వెళ్తుండడం అనేది గమనార్హం. మరి ఇప్పుడైనా "సినిమాలు చేసుకునే నువ్వు" అంటూ వేరే వాళ్ళని తక్కువ చేయకుండా ఉంటుందా అనేది చూడాలి.

