Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏంటండోయ్ నాని గారు.. అంతా ఓకేనా?!

ఏంటండోయ్ నాని గారు.. అంతా ఓకేనా?!

నాని కెరీర్లో ఎన్నడూ లేని విధంగా ఒక సినిమా కంగారు కంగారుగా రిలీజ్ అవుతోంది. ట్రైలర్ లేదు, కనీసం రిలీజ్ ప్రోమోలు కూడా ఉంటాయో లేదో తెలీదు. ఇవాళ (సెప్టెంబర్ 21) సాయంత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరగబోతోంది.

హీరోయిన్ కయాడు ఎట్టకేలకు ప్రమోషన్స్ లో కనిపించనుంది. ఈ హడావుడి మొత్తానికి తప్పు తనదేనని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఆల్రెడీ బ్లేమ్ మొత్తాన్ని తన మీదకు వేసుకున్నాడు. ఇంకో రెండు రోజుల్లో రిలీజ్, ఓవర్సీస్ కాపీస్ ఇంకా వెళ్ళలేదు, సెన్సార్ జరిగినా సర్టిఫికెట్ ఇంకా రాలేదు.

అయితే.. ఇంత అనిశ్చతి నడుమ సినిమాపై ప్రేక్షకులకి నమ్మకం ఉండడానికి, బుకింగ్స్ ఓపెన్ అయ్యి పర్వాలేదు అనుపించుకుంటుండడానికి ఏకైక కారణం నాని. శ్రీకాంత్ ఎలా తీసాడు, ప్యారడైజ్ లో ఏం ఉంటుంది అనేది పట్టించుకోకుండా ప్రేక్షకులు కేవలం నాని మీద భరోసా. నాని నుండి కంప్లీట్ బ్యాడ్ ఫిలిం అయితే రాదు అనే గ్యారెంటీ. గత కొన్నాళ్లుగా మినిమం గ్యారెంటీ హీరోగా తనను తాను మలుచుకున్న విధానం. ఫ్లాప్ సినిమాతో కూడా రెస్పెక్ట్ ను సొంతం చేసుకున్న తీరు.

కాకపోతే.. ప్యారడైజ్ తో నాని మీద ఉన్న రెస్పెక్ట్ తగ్గడమో, పెరగడమో అనేది జరిగే అవకాశాలు తక్కువ కానీ, నాని ఎన్నాళ్ల నుండో ఉవ్విళ్లూరుతున్న మాస్ ఇమేజ్ కి ఈ సినిమా ఒక గేట్ ఓపెనర్. ఈ సినిమా గనుక సక్సెస్ అయ్యి, ఆడియన్స్ నానిని మాస్ అవతార్ లో యాక్సెప్ట్ చేశారు అంటే నాని మరిన్ని మాస్ సినిమాలు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో నాని మాస్ హీరోగా అలరిద్దామని చేసిన "V, టక్ జగదీష్, దసరా, హిట్ 3" లాంటి సినిమాలు ఆడియన్స్ ను పూర్తిస్థాయిలో అలరించలేకపోయాయి.

అందుకే "ప్యారడైజ్" హిట్ అవ్వడం అనేది హీరోగా నానికి చాలా క్రూషియల్. అందులోనూ శ్రీకాంత్ ఓదెల చెబుతున్నట్లుగా మెంటల్ మ్యాడ్ నెల్ అనేది ఎలా ఉంటుంది? దాన్ని ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది మరో రెండు రోజుల్లో తెలిసిపోతుంది. మరి ఈ సినిమా హిట్టై నాని మరిన్ని మాస్ రోల్స్ ప్లే చేయడానికి డోర్ ఓపెన్ అవుతుందా? లేదా? అనేది రెండు రోజుల్లో తెలిసిపోతుంది. ప్రస్తుతానికైతే సినిమా మీద హైప్ వేరే లెవల్లో ఉంది. ఇక ఇవాళ ప్రీరిలీజ్ ఈవెంట్లో నాని ఆడియన్స్ కి ఏం ప్రామిస్ చేస్తాడు? అనేది ఆసక్తికరం. ఎందుకంటే నాని ఈవెంట్స్ లో చూపించే కాన్ఫిడెన్స్ ఆల్మోస్ట్ సినిమా రిజల్ట్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mirchi9 Telugu