ఫస్ట్ లుక్ పోస్టర్ లో షార్ప్ లుక్ తో ఒక చేతిని గన్ పై పెట్టి దర్జాగా కూర్చుని ఉన్నాడు ప్రభాస్. ఈ చిత్రానికి 'ది మోస్ట్ వైలెంట్ మెన్..కాల్డ్ వన్ మ్యాన్ .. మోస్ట్ వైలెంట్' అనే శక్తివంతమైన క్యాప్షన్ వచ్చింది, ఈ చిత్రం నీల్ స్టైల్ లో మాస్ మసాలా ఎంటర్టైనర్ కానుంది. సలార్ అంటే ఉర్దూలో లీడర్ అనే అర్ధం ఉంది.
గతంలో కన్నడ లో ప్రశాంత్ నీల్ చేసిన ఉగ్రం అనే సినిమా ప్రభాస్ తో తీస్తాడని వార్తలు వచ్చాయి. 2014లో విడుదలైన ఈ సినిమా కన్నడ బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద హిట్ గా నిలిచింది. అందులో హీరో కూడా ఒక గ్యాంగ్ లీడర్ గానే కనిపిస్తాడు. ఫ్యామిలీ యాంగిల్ కూడా ఉండే కంప్లీట్ మాస్ చిత్రం ఉగ్రం.
ఆ కథ తోనే ఈ సలార్ అనే సినిమా చేస్తున్నారా అనేదాని మీద క్లారిటీ లేదు.
ప్రభాస్‌కు ఇప్పటికే రెండు చిత్రాలు ఉన్నాయి - నాగ్ అశ్విన్ చిత్రం మరియు ఆదిపురుష్. రాధే శ్యామ్ పూర్తి చేసిన వెంటనే ఈ రెండు సెట్స్ మీదకు వెళ్లనున్నాయి. అతను ఈ చిత్రాన్ని ఎప్పుడు చేస్తాడో చూడాలి.
What's streaming on OTT? Consult the experts!

