Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నాడు శశికళ.. నేడు త్రిష?

నాడు శశికళ.. నేడు త్రిష?

మిళ రాజకీయాలలో ఎప్పుడూ ఓ 'సైడ్ క్యారక్టర్' ఉండటం, అది మహిళ కావడం తప్పనిసరిగా మారిందా? అంటే త్రిష పేరుతో జరుగుతున్న రాజకీయాలు చూస్తుంటే అవుననే అనిపిస్తుంది.

నాడు దివంగత ఎంజీ రామచంద్రన్ సమయంలో జయలలిత ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఆమె హయంలో శశికళ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు జోసఫ్ విజయ్‌ అధికారంలోకి రాగానే అయన ప్రియసఖి త్రిష పేరు గట్టిగా వినిపిస్తోంది.

జయలలిత తమిళ రాజకీయాలను కంటి సైగతో శాశించారు. అన్నాడీఎంకేని దశాబ్దాల పాటు అధికారంలో ఉంచారు. కనుక ఆమె సమర్ధత నిరూపించుకున్నారు. కానీ ఆమె స్నేహితురాలు శశికళ వలన తీరని అప్రదిష్ట పాలయ్యారు.

చివరికి ఆమె వల్లనే ప్రాణం కోల్పోయారనే పుకార్లు వినిపించాయి. జయలలిత చనిపోగానే శశికళ పార్టీ, ప్రభుత్వ పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమవడంతో ఆ పుకార్లు నిజమేనని నమ్మేవారు తమిళనాడులో చాలా మందే ఉన్నారు.

ఆ తర్వాత శశికళ అక్రమాస్తుల కేసులో జైలుకి వెళ్ళడంతో ఆమె రాజకీయ జీవితానికి హటాత్తుగా ఫుల్ స్టాప్ పడింది.

మళ్ళీ ఇంత కాలం తర్వాత ఇప్పుడు నటి త్రిషతో పేరు తరచూ వినిపిస్తోంది. సిఎం విజయ్‌కి ఆమెకు ఉన్న రిలేషన్‌షిప్ అందుకు కారణం.

ఇటీవల డీఎంకే యువరాజు ఉదయనిధి స్టాలిన్, ఓ సభలో ఆమెని ఉద్దేశ్యించి డబుల్ మీనింగ్ డైలాగ్ అన్నారు. వెంటనే పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఆయన మద్రాస్ హైకోర్టుకి వెళ్ళి వెంటనే బెయిల్‌పై తెచ్చుకున్నారు. అది వేరే విషయం.

కానీ సిఎం విజయ్‌ 'రాజకీయ వీక్ పాయింట్' త్రిష అనే విషయం స్వయంగా చాటింపు వేసుకున్నట్లయింది. 'ఎద్దు పుండు కాకికి రుచి' అన్నట్లు ఇకపై డీఎంకే నేతలు త్రిష పేరుతో సిఎం విజయ్‌ని మళ్ళీ మళ్ళీ పొడుస్తూనే ఉంటారు. కనుక ఈసారి తమిళ రాజకీయాలపై 'త్రిష ఎఫెక్ట్' ఏవిధంగా ఉంటుందో చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mirchi9 Telugu