Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'షా' తెలంగాణ పర్యటన రద్దు..

'షా' తెలంగాణ పర్యటన రద్దు..

కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన చివరి నిమిషంలో రద్దు అయ్యింది. షెడ్యూల్ ప్రకారం ఈ రోజు రాత్రికి హైద్రాబాద్ చేరుకోవాల్సిన షా చివరి నిముషంలో తన పర్యటనను రద్దు చేసుకున్నారు.

ఈ పర్యటనలో భాగంగా రేపు తెలంగాణలోని మెదక్, కరీంనగర్ ప్రాంతాలలో అమిత షా పర్యటించాల్సి ఉంది. అలాగే మెదక్ లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటుగా కరీంనగర్ లోని నాగునూరు లోని ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రజతోత్సవ వేడుకలలో ముఖ్య అతిధిగా పాల్గొనాల్సి ఉంది.

ఇక ఆ పర్యటన ముగించుకున్న అనంతరం హైదరాబాద్ లో కొత్తగా నియమించిన పార్టీ ఇంచార్జ్ లతో భేటీ అయ్యి పార్టీ నాయకులకు రాబోయే ఎన్నికలలో పార్టీ బలోపేతం పై దిశా నిర్దేశం చేయనున్నారు. టి. బీజేపీ నాయకులు కూడా షా పర్యటనకు అవసరమైన క్షేత్ర స్థాయి ఏర్పాట్లను పూర్తి చేసి షా రాక కోసం ఎదురుచూస్తున్నారు.

అలాగే అటు కేంద్ర హోమ్ మంత్రి పర్యటన దృష్ట్యా అందుకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లను అధికారులు పూర్తి చేసారు. ఈ నేపథ్యంలో అనూహ్యంగా షా పర్యటన రద్దయినట్లు ప్రకటించింది బీజేపీ. చివరి నిమిషంలో షా పర్యటన రద్దు అంటూ వార్తలు రావడంతో ఇటు టి. బీజేపీ నేతలు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

అయితే ప్రస్తుతం సీజేపీ నుంచి బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ సీఈసీ జ్ఞానేశ కుమార్ రాజీనామా డిమాండ్ తో ఢిల్లీ, ముంబై కేంద్రంగా నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో షా తెలంగాణ పర్యటన రద్దు అయిఉండొచ్చు అన్న ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే ప్రస్తుత పర్యటన రద్దయినప్పటికీ త్వరలోనే తెలంగాణలో అమిత్ షా ఉంటుందంటూ పార్టీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mirchi9 Telugu