Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఉట్టి కెగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానన్నట్లు.. విజయ్‌ పిఎం అట!

ఉట్టి కెగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానన్నట్లు.. విజయ్‌ పిఎం అట!

ట్టి కెగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానన్నట్లుంది తమిళనాడులో అధికార టీవీకే పార్టీ హడావుడి. ఎన్నికలలో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ సొంతంగా మెజార్టీ లేకపోయింది.

దీంతో ఆ పార్టీ అధినేత విజయ్‌ దాదాపు వారం రోజులపాటు గవర్నర్ చుట్టూ, ప్రతిపక్షాల చుట్టూ తిరిగారు. చివరికి డీఎంకే మిత్రపక్షాలు, కాంగ్రెస్‌, అన్నాడీఎంకే రిబల్ ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తే విజయ్‌ ముఖ్యమంత్రి కాగలిగారు. కనుక వారు మద్దతు ఉపసంహరించుకుంటే కుర్చీ దిగిపోవాలి.

ఇలాంటి పరిస్థితిలో ఉన్న విజయ్‌కి ఆ కుర్చీలో మూడు నెలలు కూర్చోగానే 'తన స్థాయి ఇది కాదు.. ప్రధానమంత్రి..' అని అనుకుంటున్నట్లున్నారు.

బహుశః అందుకేనేమో టీవీకే పార్టీలో 'విజయ్‌ ఫర్ పీఎం' అనే నినాదం మొదలింది. అప్పుడే రాష్ట్రంలో పలు జిల్లాలలో సిఎం విజయ్‌ ఫోటోతో ఫ్లెక్సీ బ్యానర్లు కూడా పెడుతున్నారు. దీనికి ప్రధాన కారణం, ఇండియా టుడే తాజా సర్వేలో ప్రధాని మోడీ (49), రాహుల్‌ గాంధీ (27)ల తర్వాత జోసఫ్ విజయ్‌ (9) మూడో స్థానంలో ఉండటమే.

ఇండియా కూటమిలో ఇప్పుడు టీవీకే పార్టీ కూడా భాగస్వామిగా ఉంది కనుక 2029లో జరుగబోయే సార్వత్రిక ఎన్నికలలో సిఎం విజయ్‌ని ఇండియా కూటమి ప్రధాని అభ్యర్ధిగా కాంగ్రెస్‌ ప్రకటించాలనేది వారి డిమాండ్.

విజయ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు, 'టీవీకే పార్టీలో నేనొక్కడినే బాస్. నా మాటే ఫైనల్' అని స్పష్టంగా చెప్పారు. కనుక అయనకు తెలియకుండా, అనుమతి తీసుకోకుండా టీవీకే పార్టీ నేతలు విజయ్‌ని ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించాలని కోరే అవకాశం లేదు. కనుక అయన సూచన మేరకే టీవీకే పార్టీ నేతలు 'విజయ్‌ ఫర్ పీఎం' అంటూ హడావుడి చేస్తున్నట్లు భావించవచ్చు.

దీనిపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర అభ్యంతరం చెప్పినట్లు సమాచారం. ఈ అంశంపై కాంగ్రెస్‌-టీవీకే పార్టీల మద్య వివాదం ముదరడంతో కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత తారహై కుత్‌బర్ట్ సీటును ఇంతకాలం టీవీకే సభ్యుల పక్కన కూర్చొన్న ప్రతిపక్ష ఎమ్మెల్యేల వైపు మార్చినట్లు తెలుస్తోంది.

ఒకవేళ సిఎం విజయ్‌కి నిజంగానే ఇలాంటి పెద్ద పెద్ద ఆలోచనలు ఉండి ఉంటే, ముందు ఉట్టిని అందుకునేందుకు బాగా ప్రాక్టీస్ చేయాలి. లేకుంటే కేసీఆర్‌లా ఫామ్‌హౌసులో పడతారు. లేదా శశికళలా రాజకీయ సన్యాసం తీసుకోవాల్సి రావచ్చు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mirchi9 Telugu