Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వైరల్ : క్రియేటివిటీ కి కాదేది అనర్హం.

వైరల్ : క్రియేటివిటీ కి కాదేది అనర్హం.

మధ్యకాలంలో భారదేశంలో కాక్రోచ్ అనే పేరు విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద పోరాడేందుకు గాను సోషల్ మీడియాలో పుట్టుకొచ్చిన పార్టీనే కాక్రోచ్ జనతా పార్టీ.

అయితే నీట్ పేపర్ లీకేజ్ కి వ్యతిరేకంగా సీజేపీ, బీజేపీ సర్కార్ పై ప్రజాపోరాటం సాగించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర రాజీనామాకు కారణంగా నిలిచింది. దశాబ్దాల బీజేపీ అధికారానికి ప్రజలు ధిక్కార స్వరాన్ని చాల బలంగా, ప్రభావంతంగా వినిపించిన సీజేపీ దేశంలో హాట్ టాపిక్ అయ్యింది.

దీనితో కాక్రోచ్ పేరు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే ప్రస్తుతం దేశంలో కాక్రోచ్ పేరు ట్రేండింగ్ లో ఉండడంతో దాన్ని కాష్ చేసుకోవడానికి ఒక బీహారీ వాసి వినూత్న ఆలోచనతో ముందుకొచ్చారు.

ఇందుకోసం తానూ కొత్తగా ఏర్పాటు చేస్తున్న కేఫ్ కి 'కాక్రోచ్ కేఫ్' అంటూ నామకరణం చేసి అందరి దృష్టిని తనవైపు కి తిప్పుకున్నారు. బీహార్ లోని నలందలో ఏర్పాటు చేసిన ఈ కేఫ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పేరు వెరైటీ గా ప్రస్తుతం ట్రెండీ గా ఉండడంతో తన కేఫ్ కి ఈ పేరును ఎంపిక చేసినట్టు కేఫ్ యజమాని తెలియచేసారు.

అయితే ఒక కేఫ్ కి ఇటువంటి ఇక కీటకం పేరు పెట్టడం అంటే క్రియేటివిటీ కి కాదేది అనర్హం అన్నట్టుగా ఉందంటున్నారు నెటిజన్లు. బొద్దింక పేరుతో ఏర్పడిన ఈ కేఫ్ వాటికీ నిలయం కాకుండా ఉంటేనే కాక్రోచ్ కేఫ్ కస్టమర్లను ఆకర్శించగలదు. అలాగే ఇక పోనుపోను ఇటువంటి వింతలూ విడ్డురాలు మరెన్ని సోషల్ మీడియాలో దర్శనమిస్తాయో చూడాలి సుమీ…!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mirchi9 Telugu