Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వైసీపీ లో VSR ప్రస్థానం ముగిసిన అధ్యయమా.?

వైసీపీ లో VSR ప్రస్థానం ముగిసిన అధ్యయమా.?

సాయిరెడ్డి లేని వైసీపీ ఎలా ఉంటుంది.? రాజకీయంగా ఎలా ముందుకు వెళుతుంది.? కేంద్ర బీజేపీ తో వైసీపీ కున్న అంతర్గత తత్సబంధాలు ఎలా కొనసాగుతాయి.? అన్న ప్రశ్నలకు వైసీపీ ఇప్పటికే తన రాజకీయ విధానాలతో ఆ పార్టీ క్యాడర్ కి ఒక స్పష్టమైన జవాబు ఇచ్చింది.

అయితే మరి వైసీపీ లేని సాయిరెడ్డి రాజకీయ జీవితం ఎలా ఉంటుంది.? అనేదానికి సాయిరెడ్డి కూడా సమాధానం చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. అతి త్వరలోనే తన పొలిటికల్ రీ ఎంట్రీ మీద ఒక స్పష్టమైన ప్రకటన ఉంటుందంటూ విజయసాయి తన X లో పోస్టు చేసారు.

తనది స్వతంత్ర భావజాలమని, ఎలాంటి ఒత్తిడిలకు, ప్రలోభాలకు, ప్రభావాలకు తలవంచనని, రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా, నిర్భయంగా, ఆత్మ గౌరవంతో నిర్ణయాలు తీసుకుంటూ రాజకీయం చేస్తానంటూ తన పొలిటికల్ రీ ఎంట్రీ పై స్పష్టత ఇచ్చారు సాయిరెడ్డి.

అయితే సాయిరెడ్డి తిరిగి వైసీపీ జెండా పట్టుకుంటారంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతుంది. అయితే జగన్ చుట్టూ ఉన్న కోటరీ రాజకీయం జగన్ నుంచి సాయిరెడ్డి ని కూడా దూరం చెయ్యగలిగిందనేది సాయి ఆరోపణలు.

ఈ నేపథ్యంలో సాయిరెడ్డి తిరిగి వైసీపీ లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు ఆ కోటరీ వైసీపీ ద్వారాలను తెరుస్తుందా.? పార్టీలో జగన్ తరువాత స్థానాన్ని సాయిరెడ్డి కి తిరిగి దక్కుతుందా.? వైసీపీ లో సాయిరెడ్డి ప్రస్థానం ముగిసిన అధ్యయమా.? లేక తెరిచిన పుస్తకమా.?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mirchi9 Telugu