Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
11 కోట్ల మంది ఇంకా రెండోడోసు వేసుకోలేదు

11 కోట్ల మంది ఇంకా రెండోడోసు వేసుకోలేదు

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 27: కొవిడ్‌ టీకా వేసుకోవడంలో చాలామంది అలసత్వం ప్రదర్శిస్తున్నారని కేంద్రప్రభుత్వం తెలిపింది. గడువు దాటినప్పటికీ, రెండోడోసు టీకాను దాదాపు 11 కోట్ల మంది ఇంకా వేసుకోలేదని వెల్లడించింది.

నిర్ణీత గడువు గడిచి ఆరువారాలు పూర్తయినప్పటికీ.. అత్యధికంగా 3.92 కోట్ల మంది రెండోడోసు తీసుకోలేదని వివరించింది. కరోనా కట్టడికి అందరూ పూర్తిస్థాయిలో టీకాను తీసుకోవాలని సూచించింది. కాగా వ్యాక్సినేషన్‌లో 100 కోట్ల డోసుల మైలురాయిని ఇటీవలే దేశం అధిగమించడం తెలిసిందే.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana