హైదరాబాద్ : ఇకోష్యూర్ సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 18న బిజినెస్ ఎగ్జిబిషన్ అండ్ కాన్ఫరెన్స్ జరుగుతుందని ఆ సంస్థ సీఈవో డాక్టర్ కేఎస్ మూర్తి తెలిపారు. సికింద్రాబాద్‌లోని బెల్సన్ తాజ్‌మహల్ హోటల్‌లో శనివారం సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలక్ట్రిక్ వాహనాలు, రియల్ ఎస్టేట్, వైద్య, ఆరోగ్య, పలు పారిశ్రామిక ఉత్పత్తుల ప్రదర్శన ఈనెల 18 నుంచి 20 వరకు జరుగుతుందని తెలిపారు. ఈసీఐఎల్‌లోని ఎన్‌సీఐసీ పార్క్‌లో ఎగ్జిబిషన్ నిర్వహిస్తామన్నారు. ముఖ్యంగా వైద్యరంగంలోని పలు అంశాలపై విస్త్రత చర్చలు జరుగుతాయని, విదేశాల వైద్య నిపుణులు పాల్గొంటారని తెలిపారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి ఎలాంటి ప్రవేశ రుసుము లేదన్నారు.
కార్యక్రమంలో డాక్టర్ రాజ్‌కిషన్, ఇకోష్యూర్ సంస్థ కోఫౌండర్ రాజశేఖర్ పాల్గొన్నారు.

