Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
2 గంటల్లో బ్రెయిన్‌ ట్యూమర్‌ గుర్తింపు.. ఇంగ్లండ్‌లో కొత్త పరీక్ష అభివృద్ధి?

2 గంటల్లో బ్రెయిన్‌ ట్యూమర్‌ గుర్తింపు.. ఇంగ్లండ్‌లో కొత్త పరీక్ష అభివృద్ధి?

నాటింగ్‌హామ్‌: ఇంగ్లండ్‌లోని నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌(ఎన్‌హెచ్‌ఎస్‌) ఉపయోగిస్తున్న కొత్త పరీక్ష ద్వారా రోగులు తమ బ్రెయిన్‌ ట్యూమర్‌ ఏ రకానికి చెందిందో, ఏ దశలో ఉందో తెలుసుకొనే సమయాన్ని గణనీయంగా తగ్గించవచ్చు.

కొన్ని కేసుల్లో రెండు గంటల్లోనే ఈ పరీక్ష ఫలితాలను తెలుసుకోవచ్చు.

యూనివర్సిటీ ఆఫ్‌ నాటింగ్‌హామ్‌ పరిశోధకులు, నాటింగ్‌ హామ్‌ దవాఖానాల ఎన్‌హెచ్‌ఎస్‌ ట్రస్ట్‌లోని వైద్య నిపుణులు ఈ పరీక్షను అభివృద్ధి చేశారు. ఈ పరీక్షలో శస్త్ర చికిత్స సమయంలో కణితి కణజాలాన్ని విశ్లేషించడానికి వేగవంతమైన జన్యు క్రమాన్ని ఉపయోగిస్తారు. నానోపోర్‌ సీక్వెన్సింగ్‌ సాంకేతికతను ఈ పరీక్షలో ఉపయోగిస్తారు. ఈ కొత్త పరీక్షలో రాబిన్‌ అనే వ్యవస్థ ద్వారా 50 మెదడు కణితి నమూనాలను పరీక్షించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana