Thursday, 21 Jan, 11.36 pm నమస్తే తెలంగాణ

తాజావార్తలు
2021లో బైజూస్ కు మార్కెట్ ఎలా ఉందంటే..?

హైదరాబాద్ : విద్యార్థులందరికీ ప్రామాణికమైన, నాణ్యమైన విద్యను అందించాలనే దిశగా బైజూస్ ప్రయత్నిస్తున్నదని బైజూస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మృణాల్ మోహిత్ తెలిపారు. జీవితాంతం అభ్యసించేలా విద్యార్థులను నిరంతరం శక్తివంతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన వివరించారు. మాకు అత్యంత కీలకమైన మార్కెట్గా ఇండియా నిలుస్తుంది. విద్యార్థులందరి అవసరాలను తీర్చేందుకు తమ సంస్థ సిద్ధంగా ఉందని మృణాల్ పేర్కొన్నారు.

*బైజూస్ కు 2021లో మార్కెట్ ఎలా ఉందనుకుంటున్నారు ?

2020 సంవత్సరం ఖచ్చితంగా ఎడ్టెక్ పరిశ్రమకు ప్రతిష్టాత్మక సంవత్సరమనే చెప్పాల్సి ఉంటుంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు , తల్లిదండ్రులు ఆన్లైన్ లెర్నింగ్ గురించి తెలుసుకోగలిగారు. 2021లో, సమ్మిళిత అభ్యాస విధానానికి ఆదరణ పెరుగుతుండటం చూస్తున్నాము. సాంకేతికత అనేది అత్యంత కీలకంగా మారింది. నిష్ర్కియాత్మకం నుంచి క్రియాశీల అభ్యాసానికి విద్యార్థులు మారేందుకు ఇది దోహద పడింది. వినూత్నమైన సింక్రోనస్ ,ఎసింక్రోనస్ అభ్యాస నమూనాల ద్వారా ఆఫ్లైన్ , ఆన్లైన్ లెర్నింగ్ కు సంబంధించి ఉత్తమతను అనుభవిస్తున్న విద్యార్థులను ఇప్పటికే మేము చూశాము. ఉపాధ్యాయులు సైతం ఆన్లైన్ విద్యను అంగీకరిస్తున్నారు, వారు ఆన్లైన్ విధానంలో బోధనను సజావుగా అందించడానికి ప్రయత్నిస్తున్నారు. వాటాదారుల నడుమ ఈ తరహా ఆలోచనా పరమైన మార్పులు ఇప్పుడు స్కీమాటిక్ , ప్రభావవంతమైన ఆన్లైన్ అభ్యాస వాతావరణం సృష్టిస్తున్నాయి. సంప్రదాయరీతిలో, ఒకరు పదుల సంఖ్యలో ఉన్న విద్యార్థులకు బోధనను అందించడం నుంచి సమ్మిళిత ముఖాముఖి అభ్యాస అనుభవాలను అందించేందుకు ఇది భవిష్యత్లో తోడ్పడుతుంది. భౌతిక , డిజిటల్ ప్రపంచాలలోని అత్యుత్తమలను రెండింటినీ ఇది అందిస్తుంది.

*అధికశాతం పాఠశాలలు ఇప్పటికీ మూతపడిన వేళ తమ అభ్యాసాన్ని విద్యార్థులు కొనసాగించేందుకు వీలుగా ఏవైనా నూతన ఉపకరణాలను, కార్యక్రమాలను బైజూస్ ఆరంభించిందా ?

బైజూస్ వద్ద మేము మా అభ్యాసాంశాలను ఉచితంగా అందించడానికి ప్రయత్నిస్తున్నాము. అందువల్ల విద్యార్ధులు సజావుగా అభ్యసించడమూ వీలవుతుంది. అదనంగా, విద్యార్థుల అనుసంధానతను వృద్ధి చేయడంతో పాటుగా వారి అభ్యాసానికి షెడ్యూల్ తప్పిపోయిన భావాన్ని తీసుకురావడానికి, మేము ప్రత్యక్ష తరగతులను విద్యార్థుల కోసం అర్హత కలిగిన ఉపాధ్యాయుల చేత నిర్వహిస్తున్నాము. నాల్గవ తరగతి నుంచి 12వ తరగతి నడుమ విద్యార్థులు ఇప్పుడు యాప్పై ఉన్న వీడియో పాఠాలనుంచి అభ్యసించవచ్చు, అలాగే బైజూస్ టీచర్స్ నుంచి ప్రత్యక్ష పాఠాలకూ ఉచితంగా హాజరుకావొచ్చు. ఆ తరువాత మా యాప్పై పరీక్షలకు హాజరుకావడం ద్వారా నేర్చుకున్న అంశాలను మరింతగా జ్ఞప్తికీ ఉంచుకోవచ్చు.

బైజూస్ తరగతులు, ప్రాంతీయ భాషలు మరియు నూతన అంశాలు

వీటితో పాటుగా, మహమ్మారి సమయంలో, మేము మరెన్నో కార్యక్రమాలను సైతం ప్రారంభించాము. అలాగే నూతన ఫీచర్లను సైతం మా ప్లాట్ఫామ్పై జోడించాము. తద్వారా విద్యార్థులు తమ అభ్యాసం కొనసాగించేందుకు సహాయపడుతున్నాము. మేము హిస్టరీ, సివిక్స్ మరియు జాగ్రఫీ అభ్యాస కార్యక్రమాలను విద్యార్థుల కోసం పరిచయంచేశాము. అంతేకాదు, మేము మా అభ్యాస మాడ్యుల్స్ను అతి ప్రధానమైన ప్రాంతీయ భాషలు అయినటువంటి మలయాళం, కన్నడ, గుజరాతీ, మరాఠీ, తెలుగు, బెంగాలీ భాషలలో అందిస్తున్నాము. తద్వారా మరింత మంది విద్యార్థులు యాప్ ద్వారా అభ్యసించే అవకాశం కల్పిస్తున్నాము, అలాగే తమ మాతృభాషలో మరింత సులభంగా నేర్చుకునే వీలునూ అందిస్తున్నాము. అంతేకాదు, మేము 'బైజూస్ తరగతుల'ను సైతం ప్రారంభించాం. దేశవ్యాప్తంగా విద్యార్థులందరికీ పూర్తి స్థాయిలో పాఠశాల పనిగంటల తరువాత అభ్యాస పరిష్కారాలను ఇది అందిస్తుంది. భారతదేశంలో అత్యుత్తమ ఉపాధ్యాయుల నుంచి తరగతులను ఇది అందించడంతో పాటుగా తక్షణమే సందేహ నివృత్తి ముఖాముఖి మెంటారింగ్ సైతం అందిస్తుంది.

"అందరికీ విద్య"

2020వ సంవత్సరంలో 'అందరికీ విద్య' అనే కార్యక్రమాన్ని సైతం బైజూస్ ప్రారంభించింది. తద్వారా భారతదేశంలో విద్యను ప్రజాస్వామ్యీకరించింది. ఈ కార్యక్రమం క్రింద, 2025 సంవత్సరం నాటికి నిరుపేద వర్గాలకు చెందిన ఐదు మిలియన్ల మంది విద్యార్థుల జీవితాలలో ప్రభావం తీసుకురావాలని బైజూస్ ప్రతిజ్ఞ చేసింది. తద్వారా, నాణ్యమైన విద్యను ప్రతి విద్యార్థికీ అందించడంలోని సమస్యను అధిగమించాలని బైజూస్ లక్ష్యంగా చేసుకుంది. అదనంగా, మేము బైజూస్ 'గివ్' కార్యక్రమాన్ని 'అందరికీ విద్య' కార్యక్రమం కింద ఆరంభించాము. 'గివ్' కార్యక్రమం ద్వారా, ప్రతి చిన్నారికీ నాణ్యమైన విద్యను అందించడం పై దృష్టిసారించింది. అదే సమయంలో బాధ్యతాయుతమైన రీతిలో పాత సాంకేతికత రీసైక్లింగ్ సమస్యను సైతం పరిష్కరిస్తుంది.

*ఇంజినీరింగ్ కళాశాలలో ప్రవేశం కోసం నిర్వహించే జెఈఈ (జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్) కు సిద్ధమవుతున్న విద్యార్థుల అవసరాలను తీర్చేందుకు ప్రత్యేకంగా ఆన్లైన్లో ఏమైనా అందిస్తున్నారా?

తొలుత టెస్ట్ ప్రిపరేష్ పరిష్కారంగా ప్రారంభమైన బైజూస్, ఎల్లప్పుడూ నాణ్యమైన అభ్యాస పరిష్కారాలను పోటీపరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు అందించడంపై దృష్టి కేంద్రీకరిస్తూనే ఉంది. బైజూస్ జెఈఈ అభ్యాస కార్యక్రమం విద్యార్థుల ప్రత్యేకమైన అభ్యాస శైలులకు అనుగుణంగా, సమగ్రమైన ,వ్యక్తిగతీకరించిన అభ్యాస అనుభవాలను వారికి అందిస్తోంది. బైజూస్ క్లాస్ ద్వారా పోటీపరీక్షల కోసం సిద్ధమవుతున్న విద్యార్థులకు సమగ్రమైన అభ్యాస పరిష్కారాలను ఇది అందిస్తుంది. ఈ కార్యక్రమ సహాయంతో, విద్యార్థులు ఇప్పుడు ఆన్లైన్ తరగతులకు భారతదేశపు అత్యత్తుమ జెఈఈ టీచర్ల వద్ద హాజరుకావడంతో పాటుగా తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు అలాగే డెయిలీ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ (డీపీపీలు) ద్వారా తమ అభ్యాసాన్ని ప్రాక్టీస్ చేయడంతో పాటుగా ఏ సమమంలో అయినా వర్క్షీట్లను ప్రాక్టీస్ చేయడం, కష్టమైన అంశాలను పునరుశ్చరణ చేయడం వంటివి ఎక్కడి నుంచి అయినా అనుసంధానిత వీడియో పాఠాల ద్వారా చేయవచ్చు.

అదనంగా, బైజూస్ జెఈఈ ఇప్పుడు ఆల్ ఇండియా టెస్ట్ సిరీస్ (ఏఐటీఎస్)ను నిర్వహిస్తుంది. అక్కడ విద్యార్ధులు అనుకరణ వాతావరణంలో పోటీపరీక్షల అనభవాలను పొందవచ్చు. ఈ టెస్ట్ సిరీస్ తమ సహచర విద్యార్థుల నడుమ తమ స్థానం ఏమిటో జాతీయ స్థాయిలో తెలుసుకునే అవకాశం అందిస్తుంది. విద్యార్థులు తమ ప్రదర్శన గురించి సవివరమైన ఫీడ్బ్యాక్ సైతం పొందగలరు. ఇది వారి అభ్యాసం మెరుగుపడటంలో సహాయపడుతూనే జెఈఈ మెయిన్ ,అడ్వాన్స్డ్ లో అత్యుత్తమ స్కోర్ నమోదు చేయడానికి తోడ్పడుతుంది.


Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana
Top