Friday, 23 Apr, 1.25 am నమస్తే తెలంగాణ

తాజావార్తలు
236 ఇది సిద్దిపేట మున్సిపల్‌ ఎన్నికల బరిలోని అభ్యర్థుల సంఖ్య

సిద్దిపేట మున్సిపాలిటీలో 43వార్డులు
అన్ని వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు
బీజేపీ నుంచి 40మంది..
కాంగ్రెస్‌ నుంచి 30మంది..
ఎంఐఎం 4, స్వతంత్రులు 116మంది..
30న పోలింగ్‌.. మే 3న కౌంటింగ్‌

సిద్దిపేట, ఏప్రిల్‌ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సిద్దిపేట మున్సిపల్‌ పోరులో 43 వార్డులకు గానూ 236 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. టీఆర్‌ఎస్‌ అన్ని వార్డుల్లో అభ్యర్థులను నిలబెట్టగా, బీజేపీ-40, సీపీఐ-1, సీపీఎం-1, కాంగ్రెస్‌-30, ఎంఐఎం-4, ఇతర రిజిస్టర్డ్‌ పార్టీ 1, స్వతంత్రులు-116 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులకు గుర్తులను కేటాయించారు. ఈ నెల 30న ఎన్నికలను నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

సిద్దిపేట మున్సిపల్‌ పోరులో 236 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 43 వార్డులకు గానూ టీఆర్‌ఎస్‌ అన్ని వార్డుల్లో అభ్యర్థులను నిలిపింది. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ తన ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నది. కాగా, ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం, ఎంఐఎం, స్వతంత్ర అభ్యర్థులు బరిలో నిలిచారు. జిల్లా అదనపు కలెక్టర్‌ ముజమ్మీల్‌ ఖాన్‌, సిద్దిపేట మున్సిపల్‌ కమిషనర్‌, ఎన్నికల అధికారి రమణాచారి పర్యవేక్షణలో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులకు గుర్తులను కేటాయించారు. ఈ నెల 30న ఎన్నికలను నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికలను బ్యాలెట్‌ పద్ధతిలో నిర్వహించనున్నారు. కొవిడ్‌ నిబంధనలకు అనుగణంగా ఎన్నికల ఏర్పాట్లు చేస్తారు. కాగా, ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌-43, బీజేపీ-40, సీపీఐ-1, సీపీఎం-1, కాంగ్రెస్‌-30, ఎంఐఎం-4, ఇతర రిజిస్టర్డ్‌ పార్టీ 1, స్వతంత్రులు-116 మొత్తం 236 మంది ఎన్నికల బరిలో నిలిచారు.

నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిశాక, ఆయా పార్టీల, స్వతంత్ర అభ్యర్థుల జాబితాను అధికారులు విడుదల చేసి, పార్టీ అభ్యర్థులకు వారివారి పార్టీ గుర్తులను కేటాయించగా, స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల సంఘం సూచించిన గుర్తులను కేటాయించారు. జిల్లాలో రోజురోజుకూ కొవిడ్‌ తీవ్రత ఎక్కువవుతున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటుంది. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు ఎలాంటి ర్యాలీలు, సభలు నిర్వహించవద్దని ఎన్‌ఈసీ స్పష్టం చేసింది. పోలింగ్‌కు 72గంటల ముందే ఎన్నికల ప్రచారం నిలిపివేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఈ నెల 27న సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగియనున్నది. ఎన్నికల ప్రచారానికి కేవలం ఐదు రోజులు మాత్రమే ఉంటుంది. ఈ నెల 30న పోలింగ్‌ జరగనున్నది. వచ్చే నెల 3న ఓట్ల లెక్కింపు చేపడుతారు.

ఆయా వార్డుల్లో అభ్యర్థులు ఇలా..
సిద్దిపేట మున్సిపల్‌లోని 43 వార్డుల్లో ఆయా వార్డుల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల సంఖ్య ఇలా ఉంది. 1వ, 5వ, 7వ, 10వ, 12వ, 13వ, 27వ, 28వ, 35వ వార్డుల్లో 5గురు చొప్పున, 2వ, 3వ, 6వ, 9వ, 26వ, 30వ, 41వ వార్డుల్లో ఆరుగురు చొ ప్పున, 4వ, 8 వ, 33వ, 37 వ, 38వ, 39 వ వార్డుల్లో న లుగురు చొప్పు న, 11వ, 16 వ, 20వ, 36 వ వా ర్డుల్లో ఎనిమిది మం ది చొప్పున, 14వ, 21వ, 23వ, 29వ, 32వ, 40వ, 43 వ వార్డుల్లో ఏడుగురు చొప్పున, 15వ, 17వ, 22వ, 24వ, 25 వ, 31వ వార్డుల్లో ముగ్గురు చొ ప్పున, 18వ, 19వ, 42 వ వార్డుల్లో 9మంది చొప్పు న, 34వ వార్డులో ఇద్దరు పోటీ చేస్తున్నారు. మొత్తం 236 మంది బరిలో నిలిచారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana
Top