హైదరాబాద్: దేశంలో ఇప్పటి వరకు 724 మందికి కరోనా వైరస్ సోకినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని చెప్పారు. కరోనా వల్ల దేశంలో ఇప్పటి వరకు 17 మంది చనిపోయినట్లు తెలిపారు. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 75 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని, నలుగురు మృతిచెందినట్లు చెప్పారు. కరోనా చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బందికి ఇన్సూరెన్స్ ప్రకటించారు. మెడికల్ స్టాఫ్‌కు సుమారు 50 లక్షల మేర బీమా చెల్లించనున్నట్లు తెలిసింది. దీని వల్ల దాదాపు 22 లక్షల మంది వైద్య సిబ్బంది లబ్ధి పొందే అవకాశం ఉన్నది. పది వేల వెంటిలేటర్లు కావాలని పీఎస్‌యూలకు ఆదేశాలు ఇచ్చినట్లు ఆయన చెప్పారు.
