Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
2,546 కోట్లతో ట్రైకార్‌ ప్రతిపాదనలు

2,546 కోట్లతో ట్రైకార్‌ ప్రతిపాదనలు

హైదరాబాద్‌, మే 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణ షెడ్యూల్డ్‌ తెగల ఆర్థిక సహకార సంస్థ (ట్రైకార్‌) వార్షిక ప్రణాళికలో భాగంగా రూ.2,546.24 కోట్లతో చేసిన ప్రతిపాదనలను బోర్డు ఆమోదించింది.

ట్రైకార్‌ చైర్మన్‌ బెల్లయ్యనాయక్‌ అధ్యక్షతన బోర్డు సమావేశం శుక్రవారం డీఎస్‌ఎస్‌ భవన్‌లో జరిగింది. ఈ సందర్భంగా గిరిజనుల ఆర్థిక వృద్ధికి సంబంధించిన అంశలపై చర్చించారు.

అందులో భాగంగా 2026-27 ఆర్థిక సంవత్సరంలో రూ.2,080కోట్లను సబ్సిడీ రుణాలుగా, రూ.466.24కోట్లను బ్యాంకుల ద్వారా గిరిజన యువతకు రుణాలను ఇప్పించాలని ప్రతిపాదించారు. మొత్తంగా రూ.2,546.24కోట్లతో చేసిన ప్రతిపాదనలకు బోర్డు ఆమోదం తెలిపింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana