హైదరాబాద్ : సర్వోత్తముడు, ఉత్తమ పురుషుడు శ్రీరాముడు పుట్టిన అయోధ్య నగరానికి ప్రధాని మోదీ బయలుదేరి వెళ్లారు. శ్రీరామజన్మభూమి వద్ద ఇవాళ భూమిపూజ జరగనున్నది. మధ్యాహ్నం 12.30 గంటలకు భూమిపూజ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ వేడుకలో పాల్గొనేందుకు మోదీ వెళ్లారు. 29 ఏళ్ల తర్వాత మోదీ.. అయోధ్యకు వెళ్తున్నారు. 29 ఏళ్ల తర్వాత ప్రధాని మోదీ అయోధ్యకు వెళ్తున్న సందర్భంగా ఆ నగరాన్ని యూపీ ప్రభుత్వం సర్వాంగ సుందరంగా అలంకరించింది. అయోధ్యలో ఉన్న రామ్‌లల్లాను దర్శించుకుంటున్న తొలి ప్రధాని కూడా మోదీ కానున్నారు. 1991లో మోదీ చివరిసారి అయోధ్య వెళ్లారు. ఆ రోజుల్లో బీజేపీ అధ్యక్షుడు మురళీ మనోహర్ జోషి.. తిరంగా యాత్ర చేపట్టారు.
ఆ యాత్ర సమయంలో మోదీ అయోధ్య విజిట్ చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల వేళ ఫైజాబాద్‌లో ర్యాలీలో పాల్గొన్నా ఆయన అయోధ్య వెళ్లలేదు.

