Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
4న ప్రధాని ఇల్లు ముట్టడిస్తాం

4న ప్రధాని ఇల్లు ముట్టడిస్తాం

  • ఈ-20 పెట్రోల్‌తో మన దేశ వాహనదారులకు నష్టం
  • అమెరికాతో ట్రేడ్‌ డీల్‌ కోసమే ఇథనాల్‌ పెట్రోల్‌ తెచ్చారు
  • మాజీ సీఎం కేజ్రీవాల్‌ వ్యాఖ్యలు

న్యూఢిల్లీ : ఈ-20 పెట్రోల్‌ను కేంద్ర ప్రభుత్వం బలవంతంగా దేశ ప్రజలపై రుద్దతున్నదని ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్‌ విమర్శించారు.

శనివారం ఎక్స్‌ వేదికగా ఆయన ఈ-20 పెట్రోల్‌పై స్పందించారు. ఈ-20 వల్ల ప్రజల వాహనాలు పాడువుతున్నాయని, మైలేజీ పడిపోవడంతో పాటు విడిభాగాలు రిపేర్లు వస్తున్నాయన్నారు. ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌ వల్ల సామాన్యులు తీవ్రంగా నష్టపోతున్నారని.. అమెరికాతో ట్రేడ్‌ డీల్‌ కోసమే ఇథనాల్‌ పెట్రోల్‌ను తీసుకొచ్చారని.. అందులో భాగంగానే ఇథనాల్‌ దిగుమతులు పెరుగుతున్నాయని కేజ్రీవాల్‌ ఆరోపించారు. ఈ-20కి వ్యతిరేకంగా ఆగస్టు 4న లాఠీలకు వెరవని 100 మందితో ప్రధాని నరేంద్ర మోదీ ఇల్లు ముట్టడిస్తామని చెప్పారు.

నన్ను ఉగ్రవాదిలా చూస్తున్నారు

ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు తహ్సీన్‌ పూనావాలాను పోలీసులు శనివారం గృహ నిర్బంధం చేశారు. దీనిపై ఆయన ఎక్స్‌ వేదికగా స్పందించారు. తాను ఈ-20కి వ్యతిరేకంగా ఆగస్టు 1న ఢిల్లీలోని గాంధీ స్మృతి వరకు పాదయాత్ర చేసి అక్కడే మౌన నిరసనతో పాటు నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించడం వల్లే ఇలా బంధించారని తహ్సీన్‌ ఆరోపించారు. వందల మంది పోలీసులు తనను ఇంటి నుంచి కదలకుండా బంధించారని వీడియోలు పంచుకున్నారు. తనను ఉగ్రవాదిలా చూస్తున్నారని.. పై నుంచి ఆదేశాలు రావడం వల్లే బంధించామని పోలీసులు తనతో చెప్పారంటూ తహ్సీన్‌ వెల్లడించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana