
కల్వకుర్తి రూరల్ : మండలంలో శనివారం 8.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తాసిల్దార్ రాంరెడ్డి తెలిపారు. మండలంలోని ఆయా గ్రామాల్లో ఉదయం దాదాపు గంటన్నరకు పైగా కురిసిన వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. కుంటలు, చెరువులు, వాగులు జలకళను సంతరించుకున్నాయి.
భారీగా కురిసిన వర్షం
చారకొండ : మండలంలోని చారకొండ, మర్రిపల్లి, జూపల్లి, సిరుసనగండ్ల, తిమ్మాయిపల్లి తదితర గ్రామాల్లో శనివారం భారీ వర్షం కురిసింది. దీంతో చెరువులు, కుంటలు నిండుకుండలను తలపిస్తున్నాయి. పంటలు కళకళలాడు తుండడంతో రైతన్న హర్షం వ్యక్తం చేస్తున్నాడు.