Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆదాయ వనరుల పెంపుపై దృష్టి పెట్టండి

ఆదాయ వనరుల పెంపుపై దృష్టి పెట్టండి

  • రిసోర్స్‌ మొబిలైజేషన్‌ క్యాబినెట్‌ సబ్‌ కమిటీసమావేశంలో భట్టి

హైదరాబాద్‌, మే 22 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ఆర్థిక పురోగతిని పరుగులు పెట్టించేందుకు, ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ అవసరాలకు అనుగుణంగా అదనపు ఆదాయ వనరులను సమకూర్చుకోవడంపై అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార ఆదేశించారు.

శుక్రవారం సచివాలయంలో రిసోర్స్‌ మొబిలైజేషన్‌ క్యాబినెట్‌ సబ్‌కమిటీ (ఆదాయ వనరుల సమీకరణ మంత్రివర్గ ఉపసంఘం) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించనున్న బడ్జెట్‌ అంచనాలకు అనుగుణంగా నిధుల సమీకరణ జరుగాలని సూచించారు. రాష్ట్ర ఖజానాకు గండి కొడుతున్న అక్రమారులపై కఠినంగా వ్యవహరించాలని కమిటీ సభ్యులైన మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు అధికారులను ఆదేశించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana