Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Aadarsha Kutumbam | వెంకీ-త్రివిక్రమ్ 'ఆదర్శ కుటుంబం'లో అదిరిపోయే సర్‌ప్రైజ్.. ఆ పాటని రీమిక్స్!

Aadarsha Kutumbam | వెంకీ-త్రివిక్రమ్ 'ఆదర్శ కుటుంబం'లో అదిరిపోయే సర్‌ప్రైజ్.. ఆ పాటని రీమిక్స్!

Aadarsha Kutumbam | విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'ఆదర్శ కుటుంబం' పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

చాలా కాలం తర్వాత ఈ ఇద్దరూ కలిసి చేస్తున్న సినిమా కావడంతో వెంకీ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఈ ప్రాజెక్ట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ముందుగా అనుకున్న సమయానికి విడుదల కావాల్సిన ఈ చిత్రం కొన్ని అనుకోని కారణాల వల్ల వాయిదా పడింది. ప్రస్తుతం మేకర్స్ సినిమాను అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే, తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వెంకటేష్ కెరీర్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న 'కూలీ నెం.1' చిత్రంలోని సూపర్ హిట్ పాట 'దండాలయ్య ఉండ్రాలయ్య'ను 'ఆదర్శ కుటుంబం' కోసం కొత్తగా రీమిక్స్ చేస్తున్నట్లు సమాచారం. 'కూలీ నెం.1' సినిమాలో వెంకటేష్‌పై చిత్రీకరించిన 'దండాలయ్య ఉండ్రాలయ్య' పాట ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ముఖ్యంగా వినాయక చవితి సమయంలో గణేష్ మండపాల వద్ద ఈ పాట వినిపిస్తూనే ఉంటుంది. తరతరాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న ఈ పాటకు ఇప్పటికీ ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పుడు అదే చార్ట్‌బస్టర్ పాటను 'ఆదర్శ కుటుంబం' కోసం రీమిక్స్ చేయనున్నారనే వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.

త్రివిక్రమ్ తనదైన శైలిలో ఈ పాటను ఎలా ప్రెజెంట్ చేస్తారు? అసలు కథలో ఈ పాటను ఏ సందర్భంలో ఉపయోగించబోతున్నారు? అనే అంశాలపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. పాత పాటలోని మ్యాజిక్‌ను అలాగే ఉంచుతూ, కొత్త తరం ప్రేక్షకులను ఆకట్టుకునేలా సరికొత్త మ్యూజిక్, గ్రాండ్ విజువల్స్‌తో ఈ రీమిక్స్‌ను రూపొందించే అవకాశం ఉందని టాక్. ముఖ్యంగా వెంకటేష్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో ఈ సాంగ్ వస్తే థియేటర్లలో మంచి సందడి నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన అందాల భామ శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. వెంకటేష్‌తో ఆమె కాంబినేషన్ ప్రేక్షకులకు కొత్తగా ఉండబోతోంది. ఇప్పటికే పలు చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీనిధి.. ఈ సినిమాలో కీలకమైన పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. వెంకటేష్ మార్క్ కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్‌కు శ్రీనిధి పాత్ర ఎలా తోడ్పడుతుందనేది ఆసక్తికరంగా మారింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana