Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆదర్శకుటుంబంలో అతిథిగా?

ఆదర్శకుటుంబంలో అతిథిగా?

వ్యక్తిగత జీవితంలోని ఒడిదుడుకుల కారణంగా దాదాపు మూడేళ్లుగా సినిమాలకు దూరమైంది తమిళ సొగసరి నివేదా పేతురాజ్‌. దుబాయ్‌కి చెందిన ఓ వ్యాపారవేత్తతో విఫల ప్రేమాయణం ఈ భామను మానసికంగా కుంగదీసిందని చెబుతారు.

అందం, అభినయం కలబోసిన పాత్రల్లో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించిన ఈ భామ టాలీవుడ్‌లో పునరాగమనానికి సిద్ధమవుతున్నది. తాజా సమాచారం ప్రకారం వెంకటేష్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆదర్శకుటుంబం' చిత్రంలో నివేదా పేతురాజ్‌ అతిథి పాత్రలో నటించనున్నట్లు తెలిసింది.

ఈ సినిమాలో కథానాయికగా శ్రీనిధి శెట్టి నటిస్తుండగా..కీలకమైన అతిథి పాత్రలో నివేదా పేతురాజ్‌ కనిపించనుందని సమాచారం. త్వరలో 'ఆదర్శకుటుంబం' సెట్స్‌లోకి ఈ తమిళందం అడుగుపెట్టబోతున్నదట. అయితే ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే. ఫ్యామిలీ ఎమోషన్స్‌కు థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ను జోడించి తనదైన కామెడీ హంగులతో దర్శకుడు త్రివిక్రమ్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana