Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'ఆకాశం నీ హద్దురా'.. ఆనందంలో చిత్ర బృందం

'ఆకాశం నీ హద్దురా'.. ఆనందంలో చిత్ర బృందం

తమిళ నటుడు సూర్య ప్రధాన పాత్రలో సుధా కొంగర తెరకెక్కించిన సూపర్‌ హిట్‌ చిత్రం 'సూరరై పోట్రు'(ఆకాశం నీ హద్దురా). ఈ సినిమా ఓటీటీలో విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఎయిర్‌ డెక్కన్‌ అధినేత కెప్టెన్‌ గోపీనాథ్‌ జీవిత చరిత్ర ఆధారంగా దీన్ని తెరకెక్కించారు. 670 పేజీలుండే 'సింప్లీ ఫ్లై' బుక్‌ను దర్శకురాలు సుధ రెండు గంటల సినిమాగా మలిచి మంచి విజయం సాధించింది. ఈ సినిమా ఆస్కార్ రేసులో నిలిచి అందరిని ఆశ్చర్యపరిచింది. ఉత్తమ నటుడు, నటి, దర్శకురాలు/దర్శకుడు, బెస్ట్‌ ఒరిజినల్‌ స్కోర్‌ విభాగాలలో ఈ సినిమా ఆస్కార్‌ రేసులో నిలిచినట్టు కొద్ది రోజుల క్రితం ప్రకటించారు మేకర్స్.

తాజాగా ఆస్కార్స్ వారు ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 366 ఉత్తమ చిత్రాల తుది జాబితాని ప్రకటించగా, ఇందులో మన దేశం నుండి సూరరై పోట్రు నిలిచింది.

ఈ విషయం తెలుసుకున్న అభిమానులు గర్వంగా చెప్పుకుంటున్నారు. తుది జాబితాలోని విజేత చిత్రాలను వచ్చే మార్చ్ 15న ప్రకటించనున్నారు. మార్చి 5 నుండి 10 మధ్య అకాడమీ వారు ఓటింగ్ నిర్వహించి విజేతలను తెలియజేయనున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana