Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆలిండియా పోలీసు క్రీడల్లో ప్రతిభ.. బ్యాడ్మింటన్‌, టేబుల్‌ టెన్నిస్‌ విజేతలకు డీజీపీ అభినందన

ఆలిండియా పోలీసు క్రీడల్లో ప్రతిభ.. బ్యాడ్మింటన్‌, టేబుల్‌ టెన్నిస్‌ విజేతలకు డీజీపీ అభినందన

హైదరాబాద్‌, మే 22 (నమస్తే తెలంగాణ) : ఉత్తరప్రదేశ్‌లోని లక్నో నగరంలో ఈ నెల 9 నుంచి 13 వరకు నిర్వహించిన 2వ ఆల్‌ ఇండియా పోలీస్‌ బ్యాడ్మింటన్‌, టేబుల్‌ టెన్నిస్‌ క్లస్టర్‌ చాంపియన్‌ షిప్‌-2025-26లో తెలంగాణ పోలీస్‌ క్రీడాకారులు ప్రతిభ కనబరిచారు.

రాష్ట్ర పోలీస్‌ క్రీడాకారులు ఒక స్వర్ణం, నాలుగు రజతాలు, ఏడు కాంస్యాలతో కలిపి మొత్తం 12 పతకాలను కైవసం చేసుకున్నారు.

ఈ నేపథ్యంలో విజేతలుగా నిలిచిన క్రీడా బృందం శుక్రవారం డీజీపీ సీవీ ఆనంద్‌ను తన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా డీజీపీ విజేతలను ప్రత్యేకంగా అభినందించి ఘనంగా సతరించారు. ఈ కార్యక్రమంలో ఐజీ (స్పోర్ట్స్‌) డాక్టర్‌ గజరావు భూపాల్‌, క్లస్టర్‌ టీమ్‌ మేనేజర్‌, డీసీపీ జి.నరసింహారెడ్డి, తెలంగాణ పోలీస్‌ స్పోర్ట్స్‌ ఆఫీసర్‌, డీఎస్పీ డాక్టర్‌ ఆర్‌.వి.రామారావు, 13వ బెటాలియన్‌ టీజీఎస్‌ పీఆర్‌ఎస్‌ఐ, టేబుల్‌ టెన్నిస్‌ కోచ్‌ ఎ.అశోక్‌, విజేతలు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana