ఆరెస్సెస్‌ను తాలిబన్లతో పోల్చిన జావేద్ అక్తర్‌పై పరువు నష్టం దావా

ఆరెస్సెస్‌ను తాలిబన్లతో పోల్చిన జావేద్ అక్తర్‌పై పరువు నష్టం దావా

నమస్తే తెలంగాణ

నమస్తే తెలంగాణ

1652d

Loading...

ముంబై : సంఘ్ పరివార్‌ను తాలిబన్‌తో పోల్చినందుకు బాలీవుడ్ గేయ రచయిత జావేద్ అక్తర్‌పై ఆరెస్సెస్ కార్యకర్త వివేక్ చంపనేర్కర్ పరువు నష్టం దావా వేశారు.

వివేక్ పిటిషన్ ఆధారంగా నవంబర్ 12న కేసు విచారణకు హాజరు కావాలని జావేద్ అక్తర్‌కు కోర్టు నోటీసులు జారీ చేసింది. జావేద్ అక్తర్ ఇటీవల పరోక్షంగా ఆరెస్సెస్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి."తాలిబన్లు ఇస్లాం దేశాన్ని కోరుతుంటే..వీరు హిందూ రాజ్యాన్ని కోరుతున్నా"రని ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

ఆరెస్సెస్ పేరును నేరుగా ప్రస్తావించకుండా జావేద్ అక్తర్ ఈ వ్యాఖ్యలు చేశారు. అక్తర్ ఆరెస్సెస్ ప్రతిష్ట దిగజార్చేలా వ్యాఖ్యలు చేశారని, ఆయన రూ కోటి పరిహారం చెల్లించాలని పిటిషనర్ తరపు న్యాయవాది ఆదిత్య మిశ్రా వాదించారు. హిందువుల కోసం పనిచేస్తున్న సంస్ధను అరాచక తాలిబన్లతో పోల్చడం ప్రజల్లో ఆరెస్సెస్ ప్రతిష్టను మసకబార్చే ఉద్దేశంతోనే అక్తర్ మాట్లాడారని ఆరోపించారు.

Your Reaction?

15
12
2
1
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana

Comments

14
Loading comments...