తాజావార్తలు
ఆర్థిక వృద్ధి రేటులో తెలంగాణ టాప్

- అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు
- కేసీఆర్ పాలనలోనే చెరువులకు జలకళ
- అభివృద్ధికి బీజేపీ నాయకులు అడ్డు..
- రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి
- కేసముద్రం, మహబూబాబాద్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశాలు
- పాల్గొన్న మంత్రి సత్యవతి, ఎంపీ కవిత, ఎమ్మెల్యే శంకర్‌నాయక్
కేసముద్రం/మహబూబాబాద్ రూరల్, జనవరి 22 : ఆర్థిక వృద్ధి రేటులో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని ఎమ్మె ల్సీ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మహబూబాబాద్‌లోని నందన గార్డెన్‌లో, ఎమ్మెల్యే శంకర్‌నాయక్ అధ్యక్షతన కేసము ద్రంలోని హరిహర గార్డెన్‌లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువతకు ఉపాధి కల్పించలేదని తప్పుడు సంకేతాలు ఇస్తున్న వారి మాటలు నమ్మవద్దని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో కోటి ఎకరాలకు సాగు విస్తీర్ణం పెరిగిందని తెలిపారు. వేసవి కాలంలోనూ చెరువులు ఎండిపోవడం లేదనే విషయాన్ని ప్రతిపక్ష నాయకులు గుర్తించాలన్నారు. కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో తెలంగాణ చెల్లిస్తున్న మొత్తంలో 40 శాతం మాత్రమే తిరిగి ఇస్తున్నప్పటికీ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నాడని తెలిపారు. నూతన మండలాలు, జిల్లాలను ఏర్పాటు చేసి వ్యవసాయ, పోలీస్, గురుకులాలు, పంచాయతీ, ఆర్టీసీ, సింగరేణి, ట్రాన్స్‌కో వంటి విభాగాల్లో వేల సంఖ్యలో ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బీజేపీ నాయకులు అడ్డుపడుతున్నారన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో, దేశ తలసరి ఆదాయం కంటే తెలంగాణ తలసరి ఆదాయం ఎక్కువన్నారు. ఉద్యోగులకు సైతం పీఆర్సీని అందిస్తామని, ప్రతి సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని, ప్రతి ఒక్కరూ రాష్ట్రం లో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు మొదటి ప్రాధాన్యత ఓటు చేయాలన్నారు.
టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి : ఎమ్మెల్యే
టీఆర్‌ఎస్‌తోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే శంకర్‌నాయక్ అన్నారు. రూ.250 కోట్లతో మహబూబాబాద్ జిల్లా కేంద్రాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. కేసముద్రంలో సకల సౌకర్యాలతో మోడల్ మార్కెట్ నిర్మాణానికి కృషి చేస్తున్నామన్నారు. ఇనుగుర్తి గ్రామాన్ని మండలకేంద్రంగా ఏర్పాటు చేయించే బాధ్యత తనదేనన్నారు. ఆయా కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ బిందు, టీఆర్‌ఎస్ నాయకులు మర్రి రంగారావు, బీరవెళ్లి భరత్‌కుమార్‌రెడ్డి, మాదారపు సత్యనారాయణరావు, ఓలం చంద్రమోహన్, మర్రి నారాయణరావు, రావుల శ్రీనాథ్‌రెడ్డి, గుగులోత్ సుచిత్ర, బానోత్ సుజాత, ఊకంటి యాకూబ్‌రెడ్డి, దామరకొండ ప్రవీణ్‌కుమార్, నజీర్ అహ్మద్, వేం వెంకటకృష్ణారెడ్డి, మోడెం రవీందర్‌గౌడ్, క ముటం శ్రీను, రావుల నవీన్‌రెడ్డి, స ట్ల వెంకన్న, బొబ్బిలి మహేందర్‌రెడ్డి, చిర్ర యాకాంతంగౌడ్, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు బాలాజీనాయక్, మున్సిపల్ చైర్మ న్ రామ్మోహన్ రెడ్డి, వైస్‌చైర్మన్ ఎండీ ఫరీద్, జడ్పీటీసీలు లునావత్ ప్రియాంక, శ్రీనివాసరెడ్డి, ఎంపీపీ మాధవి, నాయకులు పర్కా ల శ్రీనివాసరెడ్డి, సుధగాని మురళి, కేసన్‌రెడ్డి, నాయిని రంజిత్ కుమార్, యాస వెంకటరెడ్డి, లునావత్ అశోక్ నాయ క్, గద్దె రవి, గోగుల రాజు పాల్గొన్నారు.
ప్రతి కుటుంబానికి లబ్ధి : మంత్రి సత్యవతి
టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలతో తెలంగాణలోని ప్రతి కుటుంబానికి లబ్ధి చూకూరిందని మంత్రి స త్యవతి రాథోడ్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని గెలిపించేందుకు పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలన్నారు. మహబూబాబాద్‌లో కేంద్రీయ విద్యాలయం, ములుగులో గిరిజన యూనివర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించినప్పటికీ కేంద్రం కాలయాపన చేస్తున్నదన్నారు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి కేంద్రం ముందుకు రావడం లేదని, అవసరమైతే సింగరేణి ఆధ్వర్యంలో ఫ్యాక్టరీ ఏర్పాటుచేసి స్థానికులకు ఉపాధి కల్పిస్తామని అన్నారు.
సంక్షోభంలోనూ ఆగని పథకాలు : ఎంపీ కవిత
కరోనా సంక్షోభంలోనూ తెలంగాణలో సంక్షేమ పథకాల అమలు ఆగిపోలేదని ఎంపీ కవిత అన్నారు. రూ.7వేల కోట్లను రైతు బంధు పథకం ద్వారా విడుదల చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కరోనా సమయంలో ప్రతి గ్రామంలో ధాన్యం, మక్కజొన్న కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధర కల్పించిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ప్రతి కార్యకర్త పార్టీ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని సూచించారు.
related stories
-
కరీంనగర్ అధ్యయన కేంద్రాలుగా రైతు వేదికలు
-
తాజావార్తలు బీజేపీకి ఓటేస్తే పెట్రోల్ ధరలను సమర్థించినట్టే
-
తెలంగాణ తాజావార్తలు 10న ఉట్నూర్‌లో బాల్ అదాలత్