Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆర్టీసీ కార్మికులకు అపాయింట్‌ డే ప్రకటించాలి.. రేపు డిమాండ్‌ డే పాటించాలి : జేఏసీ

ఆర్టీసీ కార్మికులకు అపాయింట్‌ డే ప్రకటించాలి.. రేపు డిమాండ్‌ డే పాటించాలి : జేఏసీ

హైదరాబాద్‌, మే 29 (నమస్తే తెలంగాణ) : ఆర్టీసీ కార్మికులకు అపాయింట్‌ డే ప్రకటించాలని ఆర్టీసీ జేఏ సీ చైర్మన్‌ ఈదురు వెంకన్న, వైస్‌ చైర్మన్‌ ఎం.థామస్‌రె డ్డి, కో కన్వీనర్‌ బీ యాదగిరి డిమాండ్‌ చేశారు.

శుక్రవా రం సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశం లో వారు మాట్లాడారు. ఆర్టీసీ కార్మికుల చిరకాల వాం ఛను సీఎం నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభు త్వం ఆర్టీసీ కార్మికులను విలీనం చేయడానికి చర్యలు చేపట్టి అసెంబ్లీలో బిల్లు పాస్‌ చేసినట్టు గుర్తు చేశారు.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్‌ 2న ఆర్టీసీ విలీనానికి అపాయింట్‌ డే ప్రకటించాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ డిమాండ్‌తో ఈనెల 31న రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల్లో ఎర్ర బ్యాడ్జీలు ధరించి డిమాండ్‌ డే పాటించాలని జేఏసీ నాయకులు పిలుపు నిచ్చారు. ఈ సమావేశంలో ఎంఎస్‌ అలీ, డీగోపాల్‌, జే రాఘవులు, బుద్ధ విశాల్‌, మనోహర్‌, ఎఎస్‌ రెడ్డి, జనార్దన్‌, వెంకటయ్య, రాములు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana