- వీవీఎస్ లక్ష్మణ్
బెంగళూరు: భారత జట్టులో ఆటగాళ్ల గాయా లు ఇటీవల పెద్ద తలనొప్పిగా మారగా బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సీవోఈ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ స్పందించాడు.
క్రికెటర్లేం యంత్రాలు కాదని, కోలుకోవడానికి వారికీ తగినంత సమయం కావాలని అతడు అభిప్రాయపడ్డాడు. అంతేగాక సీవోఈ అనేది కేవలం పునరావాస కేంద్రం కాదని, క్రికెటర్లు అత్యున్నత స్థాయిలో రాణించడానికి వారికి తోడ్పాటునందించడమూ తమ బాధ్యతల్లో భాగమని చెప్పాడు. ఆటగాళ్ల గాయాల విషయంలో ఏ ఒక్కరినీ బలిపశువుగా చేయడం సరికాదన్న లక్ష్మణ్.. బీసీసీఐ, సీవోఈ, భారత జట్ల (పురుషుల, మహిళల) మధ్య అద్భుతమైన సమన్వయం ఉందని పునరుద్ఘాటించాడు. ఆటగాళ్ల ఫిట్‌నెస్‌కు సంబంధించి ఎప్పటికప్పుడూ సెలక్షన్ కమిటీకి నివేదికలు అందజేస్తామని వీవీఎస్ తెలిపాడు.

