Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆవిర్భావ సంబురం

ఆవిర్భావ సంబురం

  • ఉమ్మడి జిల్లాల్లో పూర్తయిన ఏర్పాట్లు
  • జెండాలు ఆవిష్కరించనున్న ముఖ్యఅతిథులు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంబురాలను మంగళవారం ఉమ్మడి వరంగల్‌ జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నారు.

ఈ మేరకు వరంగల్‌, హనుమకొండ, జనగామ, జయశంకర్‌భూపాలపల్లి, మహబూబాబాద్‌ జిల్లాకేంద్రాల్లో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఆయా జిల్లాకేంద్రాల్లోని ముఖ్య కూడళ్లు, ప్రభుత్వ కార్యాలయాలను అందంగా ముస్తాబు చేశారు. ముఖ్య అతిథులు జాతీయ జెండాలను ఆవిష్కరించనున్నారు.

అనంతరం జాతీయ గీతం, తెలంగాణ రాష్ట్ర గీతాలాపన, జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ప్రగతి నివేదికపై ప్రసంగాలు, పరేడ్‌, తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులకు సన్మానం, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, స్టాల్స్‌ సందర్శన తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana